కొత్త ప్రదేశం.. కొత్త డ్రెస్... ఇలా సెక్స్‌లో ప్రయోగాలు చేస్తేనే థ్రిల్!

బుధవారం, 10 ఏప్రియల్ 2013 (17:10 IST)
File
FILE
సాధారణంగా యువతీ యువకులు జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా.. ఈ విషయంలో యువతుల కంటే యువకులు ఫాస్ట్‌గా ఉంటారు. కానీ, సెక్స్‌పై ప్రయోగం చేయడానికి మాత్రం వెనుకంజ వేస్తుంటారు. ఫలితంగా సెక్స్ జీవితాన్ని రొటీన్‌గా బొర్ కొట్టేలా తూతూ మంత్రంగా పని పూర్తి చేసేస్తుంటారు.

నిజం చెప్పాలంటే.. ఒకే ప్రాంతం.. ఒకే భంగిమలో సాగే సెక్స్ ఏమాత్ర థ్రిల్ ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా చేయడం వల్ల క్రమంగా సెక్స్‌పై ఆసక్తి కూడా తగ్గిపోతుందట. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే రతి క్రీడలో ఆది నుంచి ప్రయోగాలకు తావివ్వాలని కోరుతున్నారు.

సెక్స్‌లో థ్రిల్‌తో పాటు మజాను ఆశ్వాదించాలంటే.. కొత్త ప్రదేశం, కొత్త డ్రెస్, కొత్త భంగిమ.. నోటికి రుచికరమైన ఆహారం.. ఇలా తమకు తోచిన.. ఇష్టమైన రీతిలో ఎన్ని రకాలైన ప్రయోగాలు చేస్తూ రతి చేయాలని సలహా ఇస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో అనుభవంతో భార్యను సంతృప్తి పరచడమే కాకుండా, మరో రోజు కొత్త అనుభవం కోసం ఆమె ఎదురు చూసేలా చేయాలని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి