నా బోయ్‌ఫ్రెండ్ ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినా తృప్తి కలుగడం లేదు... ఎందుకని?

గురువారం, 10 ఏప్రియల్ 2014 (22:10 IST)
WD
ప్రశ్న : నేనూ నా బోయ్‌ఫ్రెండ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. అతడు నాకు ఇచ్చిన ముద్దులు, కౌగలింతలు ఎంతో హాయిని గొలిపించేవి. కానీ ఇటీవల అతనితో సెక్స్ ఎలాంటి తృప్తిని ఇవ్వలేదు. అతడు పురుషాంగంతో ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చినప్పటికీ ఎలాంటి తృప్తి లేకుండా పోతోంది.

అతడితో ఈ విషయాన్ని చెబితే ఎలా ఫీలవుతాడో... నాపై ఏమయినా సందేహం పెంచుకుంటాడేమోనని నాలో నేనే బాధపడుతున్నాను. నిజానికి అతడితో సెక్స్ సుఖాన్ని అనుభవించలేకపోతున్నాను. సెక్సు స్పందనలు అతడికి బాగానే ఉన్నాయి. నాకు మాత్రం తృప్తి కలుగడం లేదు. మరికొన్నిసార్లు అంగ ప్రవేశం బాధగానూ, యోని వద్ద నొప్పిగానూ ఉంటోంది. కారణం ఏమయి ఉండవచ్చు...?

సమాధానం : ముందుగా పెళ్లికి ముందే సెక్స్ అనుభవం చాలామందిలో ఇలాంటి ఫలితాలనే తీసుకొస్తుంది. పెళ్లి కాకుండానే సెక్స్ అనేసరికి చాలామందిలో ఆందోళన ఉంటుంది. గర్భం వస్తుందేమోనన్న భయం ఒకవైపు... తప్పు చేస్తున్నామన్న భయం మరోవైపు వెరసి సెక్స్ అనుభవం ఇలా నిస్సారంగా మారిపోతుంది.

ఇకపోతే సెక్స్ చేసేటపుడు పురుషుడు తన పురుషాంగంతో ఎంత గట్టిగా స్ట్రోక్స్ ఇచ్చాడన్నది ప్రక్కనపెడితే... సెక్స్ పరంగా స్త్రీ ఎంతగా సన్నద్ధమయ్యిందనేది ముఖ్యం. ఫోర్ ప్లే చేయకుండా నేరుగా రతి సుఖాన్ని చవిచూసినా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కనుక ముందుగా శరీరాన్ని సెక్స్ కోసం తపించేట్లు సిద్ధం చేయాలి. ఈ రకంగా చేయాల్సింది పురుషుడే.

ఇలాంటి కార్యం చేయకుండా కేవలం సెక్స్ మాత్రమే చేస్తే ఫలితం అనుకున్నట్లుగా ఉండదు. ఒకవేళ ఇన్ని చేస్తున్నా అలాగే ఉంటే సెక్సాలజిస్టును సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి