నా భర్తతో సంతృప్తి పొందలేక పోతున్నా.. పాత బాయ్‌ఫ్రెండ్ కావాలి?

గురువారం, 1 ఆగస్టు 2013 (18:32 IST)
File
FILE
చాలా మంది యువతులు పెళ్లికి ముందు ప్రేమలో పడి, ఆ ప్రేమికులతో శారీరకంగా కూడా దగ్గరవుతుంటారు. వివాహమైన తర్వాత భర్తతో సెక్స్‌లో పాల్గొంటున్నా పాత జ్ఞాపకాలను మాత్రం మరచిపోలేరు. ఈ దాంపత్య జీవితంలో భర్త నుంచి సుఖం పొందలేని చాలా మంది భార్యలు తమ పాత ప్రియునితోనే స్నేహితునితో తిరిగి సెక్స్‌లో పాల్గొనాలని భావిస్తుంటారు. ఇలాంటి సంబంధం పెట్టుకునేందుకు ప్రేమికుడు కూడా ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి సంబంధాలు పెట్టుకోవడం న్యాయమా అని నిపుణులను సంప్రదిస్తే..

ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి కాకుండానే నాలుగు సంవత్సరాలు శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పు. ప్రేమించిన అబ్బాయిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం రెండో తప్పు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త వద్ద నిజాయితీ, నిబద్ధతతో కాపురం చేయాలి. అంతేకానీ, భర్త నుంచి సెక్స్ సంతృప్తి లభించలేదని చెపుతూ పాత స్నేహిడితో సెక్స్ సంబంధం కోసం పరితపించడం భావ్యం కాదని చెపుతున్నారు. పైపెచ్చు... పాత స్నేహితుడితో సెక్స్ సంబంధంలోకి వెళ్ళడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి