బీపీ(రక్తపోటు) ఉన్నవారు రతిక్రీడలకు దూరంగా ఉండాలా...?!!

సోమవారం, 19 ఆగస్టు 2013 (19:17 IST)
WD
సాధారణంగా మనిషి ఏ పని చేయాలన్నా శరీరంలో బలం సమృద్ధిగా ఉండాలి. అందునా రతిక్రీడలకు మనసు సహకరించినా శరీరం కూడా తప్పనిసరిగా సహకరించాలి. దీనికి మనిషి శరీరంలోని జననాంగాలకు సరిపడినంత రక్తం అవసరం. రతిక్రీడ జరిపేటప్పుడు హృదయ కంపన పెరుగుతుంది. దీంతో రక్తపోటు కూడా అధికంగానే ఉంటుంది. ఈ సమయంలో రక్తపోటు 150 మిల్లీమీటర్లకు చేరుకుంటుంది. కొందరు రక్తపోటుతో భాధపడుతుంటారు. వారిలో సాధారణ రక్తపోటు కన్నా మరికాస్త ఒత్తిడి పెరిగి 180మిల్లీమీటర్లుకు చేరుకుంటుంది.

రక్తపోటు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. రాత్రి నిద్రపోయేటప్పుడు రక్తప్రసరణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అదే మానసికపరమైన ఒత్తిడి, కోపం, ఆలోచనలు, భోజనం తర్వాత, శారీరక శ్రమ, వ్యాయామం అలాగే రతిక్రీడ జరిపేటప్పుడు దీని వేగంలో మార్పులు సంభవిస్తుంటాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ యథాస్థితికి చేరుకుంటుంది. సాధారణ స్థితి కంటే ఎక్కువ రక్తప్రసరణ ఉంటే ఇది అధిక రక్తపోటుకు చెందినదిగా గుర్తిచాలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

అధిక రక్తపోటు చాలా చిన్న సమస్య. ఆధునిక యుగంలో మనిషి జీవనశైలిలో మార్పుల కారణంగా అధికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. వారి ఆహార నియమాలలో మార్పులు, ఉరుకులుపరుగులమయమైన నేటి ఈ జీవితంలో రోగుల సంఖ్య కూడా అధికంగానే ఉందంటున్నారు వైద్యులు.

అత్యధికంగా నేటి యువతలో దాదాపు 10 నుంచి 12 శాతం రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెపుతున్నాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివారికి ప్రారంభపు దశలో ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు కనపడవని, కాని వారి పని ఒత్తిడి కారణంగా అధికరక్తపోటుకు గురయ్యే ప్రమాదముందని దీంతో వారి హృదయం వ్యాకోచిస్తుందని వైద్యులు చెపుతున్నారు. దీంతో హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎటాక్ మొదలైనవి సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు.

అధిక రక్తపోటువలన శరీరంలోని ప్రధాన అంగాలు మూత్రపిండాలు, కళ్ళు పాడైపోయే సందర్భాలు అధికంగా ఉన్నాయని వారంటున్నారు. ఇలాంటి సందర్భంలోనే పక్షవాతానికి గురయ్యే ప్రమాదముందని కూడా వైద్యులు చెపుతున్నారు. రక్తపోటు సమస్యతో బాధపడేవారు తమరక్తపోటును అదుపులో ఉంచుకోకుంటే రతిక్రియకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు.

రతిక్రీడా సమయంలో శరీరానికి క్యాలరీలు అధికంగా అవసరమవుతాయి. దీనిని పూర్తి చేయడానికి హృదయ స్పందన ప్రతి నిమిషానికి 70-80 నుంచి 100-120 సార్లు ఉంటుందని, అదే రతిక్రీడ చివరి దశలోనున్నప్పుడు గుండె ప్రతి నిమిషానికి 130 నుంచి 160 సార్లు కొట్టుకుంటుందని వైద్యులు చెపుతున్నారు. రతిక్రీడ ముగిసిన వెంటనే మళ్ళీ హృదయ స్పందన యథాస్థితికి చేరుకుంటుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధికరక్తపోటుతో బాధపడేవారు కేవలం తమ భార్యాభర్తలతోనే సంగమించాలని వైద్యులు సూచిస్తున్నారు. అదే అపరిచిత వ్యక్తులతో సంబంధాలను కొనసాగనివ్వకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేస్తే వారిలో అధికరక్తపోటు ఎక్కువై ప్రమాదానికి దారితీస్తుందని వారు సూచిస్తున్నారు.

రక్తపోటు మరీ అధికంగా ఉన్నట్లు తేలితే ఆ రోజుకు రతిక్రీడకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలంటున్నారు. రక్తపోటు ఆధీనంలోకి వచ్చేంతవరకు ఇలా రతిక్రీడకు దూరంగా ఉంటేనే ఛాలా మంచిదంటున్నారు వైద్యులు. ఒకవేళ రక్తపోటుకు సంబంధించిన మాత్రలు, మందులు వాడుతుంటే దానిని ఎలాంటి సందర్భంలోనూ నిలపకూడదంటున్నారు వైద్యులు.

అధిక రక్తపోటు కారణంగా రోగులు అత్యధికంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారని, దీంతో కామక్రీడలలో త్వరగా అలసిపోతారని, అలాగే శ్వాసక్రియలో కూడా మార్పులు జరిగి హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

అధికరక్తపోటుకు ప్రధానమైన కారణం ఏంటంటే చాలా రోజులుగా ఉండే మానసికమైన ఒత్తిడి మూలమని వైద్యులు అంటున్నారు. దీంతో రతిక్రీడకు సంబంధించి అయిష్టత ఏర్పడుతుంది. శీఘ్రస్ఖలనం, నపుంశకత్వపు సమస్యలబారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దీంతో తాము జీవితంలో చాలా కోల్పోయామని రోగులు భావిస్తారని మానసిక వైద్యనిపుణులు సూచించారు. ఇలా అనుకోవడం కూడా వారి మానసిక బలహీనతే ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు.

అధికరక్తపోటుతో బాధపడుతుంటే అలవాట్లు, భోజనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మార్పులు చేసుకోవాలి. ఒత్తిడికి లోనుకాకండి. జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దుర్వ్యసనాలుంటే వాటిని మానుకోవడానికి ప్రయత్నంచాలి. ఎల్లప్పుడూ అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

అధిక రక్తపోటుతో బాధపడుతుంటే మద్యపానం, పొగాకు సంబంధించిన వస్తువులు, ధూమపానం చేసే అలవాటుంటే వాటిని మానేందుకు ప్రయత్నంచాలి. అలాగే వీటికి బదులుగా పుష్టికరమైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉప్పును తగ్గించాలి. శరీర బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. నియమానుసారం వ్యాయాయమం చేయాలి. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు మందులు తప్పనిసరిగా ఉపయోగించాలంటున్నారు వైద్యులు.

వెబ్దునియా పై చదవండి