భర్త ముందే ఆయన ఫ్రెండ్స్.. నన్ను తినేసేలా చూస్తున్నారు? ఏం చేయాలి?

బుధవారం, 7 ఆగస్టు 2013 (19:25 IST)
File
FILE
చాలా మంది పురుషులు (భర్తలు) తమ స్నేహితులను తమ ఇళ్లకు ఆహ్వానిస్తుంటారు. ఇలా ఇంటికి తీసుకొచ్చే స్నేహితుల్లో మంచోళ్లు ఉంటారు.. చెడ్డోళ్లు ఉంటారు. మరికొందరికి మద్యం సేవించే అలవాటూ ఉంటుంది. వీరిలో కొంతమంది పెళ్లి కాని కుర్రాళ్లూ ఉంటారు. ఇలాంటి వారిని ఇంటికి తీసుకొస్తే... ఇంట్లోని మహిళలను అదోరకంగా చూస్తూ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తారు.

దీనికి కారణం లేక పోలేదు. పురుషులు తమ స్నేహితులతో కలిసి ఎవరితోపడితే వారితో సెక్స్‌ సంబంధాలు పెట్టుకోవడమే. దీంతో తమ ఇంటికి వచ్చేవారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు ఆసక్తి చూపుతారు. పైగా ఇంటికి తీసుకువచ్చిన తన మిత్రులు ఆయన ముందరే నన్ను తినేసేలా చూస్తున్నా... ఏమీ అనడు. పైగా తప్పేంటి వాళ్లు అలా చూస్తే అని ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్య నుంచి ఏ విధంగా గట్టెక్కాలన్న అంశంపై నిపుణులను సంప్రదిస్తే...

ఇలాంటి పురుషులు అసభ్యకరరీతిలో సభ్యసమాజం హర్షించని అసహజ శృంగార ప్రవర్తనతో తృప్తిచెందుతున్నట్టుగా భావించాలి. జీవితంలో శృంగారానికి భర్తే కాదు... భార్యల కూడా ఒక్కొక్కసారి దూరంగా ఉంటుంది. కొన్ని దశల్లో తప్పదు. అలాగని ఎవరితోపడితే వారితో విచ్ఛలవిడిగా అలా శృంగార సంబంధాలు పెట్టుకోవడం మంచిదేనా? భార్యభర్తల మధ్య ఒక్క దేహ సంబంధం మాత్రమేనా ఉండేది.

తనకు పిల్లల్ని కని ఇచ్చే భార్య శృంగార సుఖం ఇవ్వలేకపోతోందని పరస్త్రీలతో కోరికలు తీర్చుకునే భర్త ఎంత వరకు భార్యకు... బంధానికి గౌరవం ఇస్తున్నాడు? అంత అసహ్యంగా ప్రవర్తించి మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయిన అతను కాళ్లబేరానికి రాగానే మీరు చప్పబడిపోతున్నారు. ఇలా చేయడం వల్లే పురుషులు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారని వారు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి