భార్యతో సంభోగం ఎపుడు చేయాలి!!

File
FILE
అనేక మంది కొత్త దంపతులకు సెక్స్ ఎపుడు చేయాలి. పగటి పూటా లేకా రాత్రి పూటా. అలాగే, సెక్స్ చేసేందుకు ఏదైనా సమయం సందర్భం ఉందా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. దీనిపై సెక్స్ నిపుణులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెపుతున్నారు.

పెళ్లయిన కొత్త జంటలు రోజుకు నాలుగైదు సార్లు సెక్స్‌లో పాల్గొంటుంటారు. అయితే, సెక్స్ నిపుణుల సూచన మేరకు రోజుకు ఒక్కసారే సెక్సు చేయటం, అదీ ఒక రోజు గ్యాప్ తీసుకొని చేయటం మంచిదని వారు అంటున్నారు. అలాగే పగటి పూట రతిక్రియ చేయకూడదని కరాఖండిగా చెపుతున్నారు. సంభోగానికి రాత్రి పూట మాత్రమే అనువైన సమయంగా పేర్కొంటున్నారు.

అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలని వారు సూచన చేస్తున్నారు. ఇకపోతే.. రాత్రి భోజనం చేసిన వెంటనే రతి క్రీడకు ఉపక్రమించరాదట. కనీసం రెండు గంటల పాటు గ్యాప్ ఇచ్చి ఆ పని చేయాలని వారు చెపుతున్నారు.

అలాగే, రాత్రి అన్నం తిన్న తర్వాత రెండు గంటల తర్వాత సెక్సును ప్రారంభించాలట, నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెపుతున్నారు.

ఇకపోతే.. స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించరాదట. మొదటి మూడు రోజులు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కనీసం కండోమ్‌ను కూడా ఉపయోగించి కూడా జరుపకూడదని చెపుతున్నారు. ఈ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి