మత్తుమందు తీసుకుంటే సెక్స్‌లో రెచ్చిపోవచ్చా...?!!

శుక్రవారం, 9 ఆగస్టు 2013 (22:43 IST)
మత్తు పదార్థాలను తీసుకోవడం సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనీ, అంగస్తంభన ఎక్కువ సేపు ఉంటుదన్నది అపోహ మాత్రమే. మత్తు పదార్థాలను "ఎక్టసీ" అని "లవ్ డ్రగ్" అని ఇంగ్లీషులో పిలుచుకుంటారు.

ఈ పదార్థాన్ని తినడం వలన, పొగ పీల్చడం వలన, దాని ప్రభావం శరీరంలో సెరటోనిన్ హార్మోన్ విడుదలై ఏదో తెలియని ఆనందం తెస్తుంది. ఆ మత్తుమందు ప్రభావం తగ్గేసరికి తిరిగి భయం, ఆందోళన, డిప్రెషన్ ఏర్పడతాయి.

పైగా వీటిని ఉపయోగించేవారు ఏ పనిపైనా మనసు లగ్నం చేయలేరు. అర్థం లేని కలలు వస్తుంటాయి. కండరాల నొప్పులు, వాంతులు, ఆ పిదప వణుకుడు రోగం కూడా తగులుకుంటుంది. శరీరంలోని నీరు లాగేయడం వల్ల విపరీతమైన దాహం కలుగుతుంది. ఈ అలవాటు అలాగే కొనసాగిస్తే ప్రాణం మీదికి వస్తుంది.

వెబ్దునియా పై చదవండి