మా వారూ.. రోజూ సెక్స్ కావాలని వేధిస్తున్నారు.. ఏం చేయాలి?

శనివారం, 10 ఆగస్టు 2013 (17:50 IST)
File
FILE
చాలా మంది పురుషులు స్కజోవూఫినియా వ్యాధితో బాధపడుతూ ప్రతి రోజూ సెక్స్‌ కోసం పరితపిస్తుంటారు. ఇందుకోసం తమ భార్యలను వేధిస్తుంటారు. దీన్ని తట్టుకోవడం చాలా మందికి కష్టంగా మారుతుంది. ఇలా మానసిక వ్యాధి వారిలో సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయా? ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కాలన్న అంశంపై నిపుణులను సంప్రదిస్తే...

విపరీత మానసిక అపసవ్యతా లక్షణం ఉన్న మానసిక వ్యాధుల్లో ఈ రకమైన తీవ్ర లైంగిక వాంఛను గమనించవచ్చన్నారు. స్కజోవూఫీనియా వంటి మానసిక వ్యాధుల్లో ఏ రకమైన మానసిక అవరోధాలు ఉండక పోవడం కూడా ఒక ప్రధాన కారణమని చెపుతున్నారు.

వీరి మెదడులోని అన్ని స్ఫియర్స్‌లో చురుకుదనం హెచ్చుతుంది. అలాగే, కొన్ని శారీరక కారణాలు కూడా వేగంగా పని చేస్తుంటాయి. ఈ కారణంగా సెక్స్ కోసం పరితపిస్తుంటాడని పేర్కొంటున్నారు.

శృంగార హార్మోన్స్‌లో విపరీతమైన అసమతుల్యత కూడా ఈ స్థితికి కారణమన్నారు. అంతేకాకుండా, దంపతులిరువురూ సెక్సాలజిస్ట్ వద్దకు వెళితే సెక్సువల్ కౌన్సెలింగ్ ద్వారా కూడా మీ సమస్య పరిష్కారమవుతుందని సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి