మొండితనం కంటే... ఓపికే రతి క్రీడకు ముఖ్యం!!

File
FILE
వైవాహిక జీవితంలో రతి క్రీడ అత్యంత ముఖ్యమైంది. ఇందులో భార్యాభర్తలిద్దరూ ఎల్లలులేని సంతోషాన్ని పొందేందుకు తాపత్రయ పడుతుంటారు. అయితే, చాలామంది భర్తలు తమ భార్యలు సెక్స్‌లో సహకరించడం లేదని తమ స్నేహితుల వద్ద వాపోతుంటారు. అసలు ఆ పరిస్థితి తలెత్తడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు భర్తలు కాస్త కూడా ప్రయత్నించరు.

నిజానికి ఈ అసంతృప్తి వెనుక అనేక కారణాలుంటాయంటున్నారు సెక్సాలజిస్టులు చెపుతున్నారు. చాలామంది స్త్రీలకు ప్రత్యేకించి కొన్ని భాగాల మీద భర్త చేయి వేస్తే కస్సుమంటారు. అలా కలగటానికి కారణమేమై ఉంటుందో తెలుసుకొని భర్తలు నడుచుకోవడమే కాకుండా, మొండితనంగా అక్కడ చేయి వేసేందుకు ప్రయత్నించరాదని సలహా ఇస్తున్నారు. లేనిపక్షంలో ఒక సుఖరాత్రి కాస్తా నిట్టూర్పుల రాత్రిగా మిగిలిపోతుందని చెపుతున్నారు.

ఇందుకోసం భార్యను తమ దగ్గరికి తీసుకుని ఆమెలో ఉన్న బాధ లేదా కోర్కెను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సెక్స్‌లో ఇద్దరూ సమానంగా అనుభవాలను పంచుకునేలా ఒప్పించాలి. ముఖ్యంగా, భార్యకు సెక్స్ పట్ల ఉండే ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. ఒకవేళ ప్రత్యేకించి కొన్ని భాగాలపై చేతులేయవద్దు అనంటే కొన్నాళ్లు ఓపికపట్టి, ఆ అనుభూతిలో ఉండే తృప్తిని తెలియజెప్పే పుస్తకాలనో, సినిమాలనో చూపించి తమ వైపుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని అంటున్నారు.

సెక్స్ విషయంలో ఒకరికొకరు సహరించుకోవాలి తప్ప యుద్ధం చేసుకోకూడదు. అలాగే, భర్తకు ఇష్టమైన పనికి భార్య ఇష్టం లేకపోయినా ఇష్టం చేసుకోవాలి. అలాగే భర్త కూడా. అలా ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే దాంపత్యం సజావుగా సాగుతుంది. ముఖ్యంగా దంపతులిరువురూ కలిసి గడిపే సమయాన్ని పెంచుకోవాలని వారు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి