యువతీయువకుల్లో పెరుగుతున్న కామ కోర్కెలు!

File
FILE
మారుతున్న కాలంతో పాటు.. యువతీయువకుల అలవాట్లూ మారుతున్నాయి. కోర్కెలు పెరుగుతున్నాయి. వాటిని తీర్చుకోవాలన్న తపనా ఎక్కువై పోతోంది. ఇందుకోసం విచ్చలవిడిగా పైసలు ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.

అయితే, నేటి యువతీ యువకులకు కలిగే కోర్కెల్లో ఎక్కువగా సెక్స్‌ సంబంధించినవే ఉన్నట్టు వివిధ సర్వేల ద్వారా తేలింది. అందుకే ఇతర వ్యాపకాల కంటే.. శృంగారానికి యువత డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతున్నట్టు తేలింది.

యుక్త వయస్సులో శృంగారాన్ని సక్రమంగా అనుభవించని వారు జీవితంలో చాలా కోల్పోతారని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆధునిక యువత తమ లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకు ఉవ్విళ్లూరుతూ విపరీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తమకు కలిగే సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు యువతీయువకుల్లో ఎవరికైనా మరొకరు అవసరం. అలాగే, సెక్స్‌లో పాల్గొనేందుకు కూడా 237 కారణాలు ఉన్నట్టు సెక్స్ నిపుణులు చెపుతున్నారు. వీటిలో మూడు ముఖ్యమైన కారణాలను మాత్రం వారు వెల్లడిస్తున్నారు. అందులో ఒకటి మంచి సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, ప్రేమలో మునిగి తేలేందుకు, అసలు సెక్స్ అంటే ఏంటో ఒకరికొకరు తెలుసుకోవాలన్న తపన వంటి కోర్కెలు ఎక్కువగా ఉన్నట్టు అందులో తేలింది.

వెబ్దునియా పై చదవండి