రతిలో మహిళకు భావప్రాప్తి కలుగాలంటే పురుషుడేమి చేయాలి?

బుధవారం, 9 జనవరి 2013 (17:29 IST)
File
FILE
సాధారణంగా చాలా మంది మహిళలకు రతిలో ఏ రకమైన భావప్రాప్తి లేదా ఉద్వేగం కలగటం లేదని తోటి స్నేహితుల వద్ద వాపోతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందన్న అంశాన్ని పరిశీలిస్తే... ప్రధానంగా సెక్స్‌లో పాల్గొనే మహిళకు రతి క్రీడలో కేవలం రెండంటే రెండు నిమిషాలు మాత్రమే స్వర్గలోక ఆనందాన్ని పొందుతారట. అలాగే, పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనే మహిళకు రెండు అంశాల్లో ఆందోళన చెందుతుందట. అది ఒకటి గర్భం వచ్చేస్తుందనే భయం కాగా మరొకటి, తాను ఎంజాయ్ చేసే మగాడి నుంచి సుఖ వ్యాధులు అంటుతాయనే భయం ఉంటుందట.

అలాంటి సమయంలో సురక్షితమైన సెక్స్‌ పద్ధతులు పాటించి రతి క్రీడలో పాల్గొనంత సేపు ఎంజాయ్ చేయాలని సెక్స్ వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, సెక్స్ చేసే సమయంలో తమలో వచ్చే అనుమానాలను భర్యాభర్తలిద్దరు ఏమాత్రం బిడియం, సంకోచం లేకుండా చర్చించుకోవడంలో తప్పులేదని చెపుతున్నారు. అపుడే భార్యా భర్తలిద్దరు భావప్రాప్తి పొందగలుగుతారని చెపుతున్నారు.

కొన్నిసార్లు భావప్రాప్తి మహిళలు శారీరక కారణంగా కూడా పొందలేరు. అయితే, కొద్దిపాటి మార్గదర్శకతతో వీరు లైంగిక చర్యలలో నిపుణులుగా కూడా రాణించగలరు. మహిళకు ఒకసారి భావప్రాప్తి లేదా స్కలనం జరిగిందంటే, రెండో సారి భావప్రాప్తి తేలికవుతుందట. ఒకే సెషన్‌లో రెండు లేదా మూడు సార్లు సైతం ఆమె భావప్రాప్తి పొందే అవకాశం ఉంది. కాని పురుషుడి అంగం, ఫోర్ ప్లే, అతని శారీరక చర్యలు వంటివి అందుకు మళ్లీ సహకరించేలా ఉండాలి.

అదేసమయంలో సెక్స్‌లో ఎంత సేపు పాల్గొన్నా భావప్రాప్తి పొందలేని మహిళలు కూడా సెక్స్ వైద్య నిపుణులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు. వారు ఆమె గత జీవితాన్ని స్టడీ చేసి ఆమెను ఏ రకమైన చర్యలు లైంగిక చర్యలకు ప్రోత్సహిస్తాయి, ఏ రకంగా ఆమె భావప్రాప్తి తేలికగా పొందగలదు అనే అంశాలు వివరిస్తారు. కొన్నిమార్లు పుస్తకాలు, వీడియోలలో దొరికే సమాచారం కూడా సహకరిస్తుందని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి