లావుగా ఉన్న మహిళల్లో సెక్స్ యావ తక్కువా...?

FILE
వయసుకు మించిన బరువు, స్థూలకాయం సమస్యలతో బాధపడే మహిళల్లో సెక్స్ కోర్కెలు ఏ విధంగా ఉంటాయీ...? అసలు వారు శృంగారంలో పాల్గొనగలుగుతారా...? అనే సందేహం కొందరి పురుషులను తొలచివేస్తుంటుంది. నిజానికి అధికబరువు కలిగిన మహిళలు సెక్స్ పట్ల ఆసక్తి కనబరిచినప్పటికీ వారి భాగస్వాములు తగిన ఆసక్తిని కనబరచరని వైద్యులు చెపుతున్నారు.

లావుగఉండి చూసేందుకు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అధిక బరువును అదుపులో పెట్టుకోని మహిళల్లో అనారోగ్య సమస్యలు దాగి ఉంటాయంటున్నాడు రష్యాకు చెందిన వైద్యుడు జాన్ విలియమ్. బీఎమ్ఐ( బాడీ మాస్ ఇండెక్స్) పాయింట్ 29 ఏళ్లు దాటిన స్త్రీలలో మోతాదుకు మించి ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందంటున్నారు.

21 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లో అధిక బరువు సమస్య తలెత్తే అవకాశం కాస్త తక్కువగా ఉన్నట్లు తేలిందంటున్నాడు. అయితే మారిన ఆహారపుటలవాట్ల నేపథ్యంలో యుక్తవయస్సుకు చేరుకునేసరికే అధికబరువును కొనితెచ్చుకునేవారు అధికమవుతున్నారని ఆందోళన వెలిబుచ్చారు.

అధికబరువు, స్థూలకాయం సమస్యలతో బాధపడే 3 వేలమంది జంటలలో సెక్స్ సామర్థ్యం తీరును పరిశీలించినపుడు... వారిలో 1800 జంటలు మాత్రమే దాంపత్య సుఖాన్ని ఓ మోస్తరుగా అనుభవిస్తున్నట్లు తేలింది. మిగిలిన 1200 జంటల పడక గది జీవితం నిస్సారంగా గడిచిపోతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని విలియమ్ పేర్కొన్నాడు.

కనుక అధిక బరువు సమస్యను వదిలించుకున్నప్పుడే సెక్స్‌లో పూర్తి స్థాయిలో పాల్గొనగలుగుతారని వెల్లడించాడు. అంతేగాక భారీ శరీరం కలిగిన మహిళల్లో పిల్లలు పుట్టే శక్తి కూడా తక్కువగా ఉంటుందని విలియమ్ పేర్కొన్నాడు.

వెబ్దునియా పై చదవండి