వక్షోజాలు జారినట్లున్నాయ్... నలుగురిలో వెళ్లాలంటే....

మంగళవారం, 4 జూన్ 2013 (17:15 IST)
File
FILE
చాలా మంది మహిళలు వక్ష సంపద భారీగా ఉంటుంది. పెళ్లికి ముందు... పెద్దగా తెలియక పోయినప్పటికీ.. వివాహమై, పిల్లలు పుట్టిన తర్వాత ఈ వక్ష సంపద చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తుంది. వీటిని దాచుకునేందుకు టైట్‌గా ఉండే జాకెట్లు వేసుకున్నా.. వక్షోజాలు జారినట్టుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే మహిళలు నలుగురిలో వెళ్లాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మహిళలు తమ వక్ష సంపద గతంలో లాగా గట్టిగా అయ్యేందుకు ఏదైన మార్గం ఉందా అనే అంశంపై నిపుణులను సంప్రదిస్తే...

పిల్లలు పుట్టిన తర్వాత సహజంగా చాలా మందికి వక్షోజాలు జారినట్లు కనిపించడం సహజం. దాన్ని మనసులో పెట్టుకుని మానసిక వేదనను అనుభవించడం సరికాదు. కొన్ని రకాల బ్రాలు వక్షోజాలను పట్టి ఉంచి బిగుతుగా ఉన్నట్లు కనిపించేలా చేస్తాయి. అలాగే కొన్ని రకాల ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారా కూడా వక్షోజాలను గట్టిగా ఉండేలా చేసుకోవచ్చు. వక్షోజాలు గట్టిపడేందుకు ఇంతకు మించిన ఇతర పద్ధతులు లేవంటున్నారు.

వెబ్దునియా పై చదవండి