శృంగారంలో దంపతులు చేసే తప్పులేంటి?

సోమవారం, 3 జూన్ 2013 (16:09 IST)
File
FILE
చాలామంది దంపతులు శృంగారంలో తమకు తెలియకుండానే అనేక తప్పులు చేస్తుంటారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఎవరు తప్పు చేసిన వారిని విసుక్కోకుండా.. వారిని నివ్వించేందుకు ప్రయత్నించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకానీ, వారిని చూసి నవ్వడం, సిగ్గుపడటం, సీరియస్‌గా ముఖం పెట్టడం వంటివి చేయరాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. అపుడే పడక గదిలో మరింత రసరంజుగా దంపతులు ఎంజాయ్ చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. సెక్స్ సమయంలో దంపతులు చేసే అలాంటి తప్పులేంటో ఇక్కడ చూద్ధాం.

చాలా మంది దంపతులు ఫోర్‌ ఫ్లేను పెద్దగా పట్టించుకోరు. నేరుగా రతికి దిగిపోతారు. పురుషుడు రతి పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారో.. స్త్రీ కూడా ఫోర్‌ ప్లేపై అంత ఆసక్తిని చూపుతుందన్న విషయాన్ని మరచిపోరాదని సలహా ఇస్తున్నారు. స్త్రీ ఫోర్‌ప్లే ద్వారానే ఎక్కువగా భావప్రాప్తి పొందుతుందని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది పురుషులు.. తాము సెక్స్ చేసేందుకు ముందుగా.. అంగం వంటి బొమ్మతో సెక్స్ చేస్తారు.

ఒక స్త్రీ ఈ తరహా సెక్స్‌కు అలవాటు పడిందంటే పురుషుడు చేసే రతి చాలదని, బొమ్మతోనే రతి కావాలని కోరుకుంటుందని చెపుతున్నారు. సెక్స్‌కు ముందు నీలి చిత్రాలు చూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ చిత్రాలు చూసేందుకు స్త్రీ అలవాటు పడితే పురుషుడిని పెద్దగా పట్టించుకోరని, అందువల్ల ఈ తరహా చిత్రాలు చూపించరాదన్నారు. ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలన్నారు.

వెబ్దునియా పై చదవండి