శృంగారంలో స్త్రీపురుషుల ఆందోళనలకు కారణాలేంటి?

గురువారం, 8 ఆగస్టు 2013 (16:24 IST)
File
FILE
అనేక మంది స్త్రీపురుషులు లేదా భార్యాభర్తలు శృంగార జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో తమ దాంపత్య జీవితంలో వారు పూర్తి సంతృప్తి పొందలేరు. ఇలాంటి పరిస్థితికి అనేక రకాల వ్యతిరేక భావోద్వేగాలైన కోపం, భయం, ఉద్వేగం, ఆందోళన, కృంగుబాటుతనం, ఒత్తిడి లాంటివి ఉంటాయి.

అంతేకాకుండా స్త్రీపురుషులు తమలో శృంగారం సమర్థత లేదని భావించడం, తమ కలయిక వల్ల గర్భం వస్తుందా? రాదా? అనే సందేహం ఉండటం, యోని ద్వారా కడుపులోకి వీర్యం వెళ్లడం మంచిది కాదేమో అనే ఆలోచన స్త్రీలలో ఉండటం, వక్షోజాలు చిన్నగా లేదా మరీ పెద్దగా ఉన్నాయని భావించడం, తన జననాంగాల నుంచి వచ్చే వాసన భర్తకు నచ్చదేమోనని భావించడం, సెక్స్ వల్ల యోనిలో నొప్పి, రక్తస్రావం అవుతుందన్న భావన వాలిలో ఉండటం వల్ల ఈ తరహా ఆందోళనలు ఉంటాయని చెపుతున్నారు.

అయితే, వీటిల్లో కొన్ని ఆందోళనలు ఖచ్చితంగా కొన్ని సహజమైన కారణాల వల్ల వస్తాయి. వాటిని ప్రి అండ్ పోస్ట్‌మెరైటిల్ కౌన్సెలింగ్ ద్వారా తగ్గించవచ్చు. దంపతులిద్దరిలో శాస్త్రీయమైన విశ్లేషణ ద్వారా ఆందోళనల స్థాయిని తగ్గించవచ్చు. కానీ, కొన్ని రకాల ఆందోళనలకు హేతువు ఉండదు. మూఢనమ్మకాల వల్ల, అశాస్త్రీయ జ్ఞానం వల్ల అవి పెంపొందుతాయని చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి