సంతానం కలగట్లేదా..!

సంతానం కోసం జంటలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. డాక్టర్ల వద్దకు పరీక్షలకోసం పరుగులు తీస్తుంటారు. ఎన్నో రకాల ప్రయోగాలనంతరంకూడా వారికి సంతానయోగం కలగకపోగా కొందరు నిరాశకు గురవుతుంటారు. కాని దీనికి ఇంత బాధపడవలసిన అవసరం లేదంటున్నారు శాస్త్రజ్ఞులు. కపుల్స్ చేయాల్సిందల్లా ఒక్కటే...అదేంటంటే వైల్డ్ సెక్స్. చదవడానికి, వినడానికి మరీ విడ్డూరంగా ఉన్నా ఇది నిజమని పరిశోధకులు అంటున్నారు. అదికూడా ఎలా చేయాలంటే ఇక్కడ ఇద్దరూకూడా ఎలాంటి బిడియం, సిగ్గు, హద్దులు లేకుండా ప్రవర్తించాలంటున్నారు పరిశోధకులు.

లవ్ మేకింగ్ అంటే రతిక్రియలో క్వాలిటీ చాలా ఉత్తమంగా ఉండాలని దీనికి మహిళలను కన్విన్స్ చేసి వారిని తమదారిలోకి తీసుకురావాలి. దీంతో వారిలో నూతనోత్సాహం కలిగి, రతిక్రియలో మీకు తోడ్పడటానికి సహకరిస్తారని పరిశోధకులు తెలిపారు.

హద్దులుమీరి అదుపులేకుండా ఆటంకం కలగకుండా మనసును రతిక్రియపై లగ్నం చేసి పాల్గొంటే ఫలితం తప్పకుండా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి రతిక్రియలో ఇరువురుకూడా కలిసి ఒకరికొకరు సంతృప్తినివ్వడానికి ప్రయత్నించాలి. దీంతో సంతానం కలిగే సూచనలు కనపడతాయంటున్నారు వారు.

చాలామంది జంటలు(కపుల్స్) కేవలం సంతానం కోసం అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుందని, కాని సంతృప్తిగా వారు రతిక్రియను జరపడం లేదన్న విషయం పరిశోధనలో తేలిందని, దీంతో వారికి సంతానం కలగడం లేదని పరిశోధకులు వివరించారు. వారు చేసే రతిక్రియ ఓ యంత్రం చేసేలా ఉంటుందని, ఆ కార్యం కూడా ఓ పనిలాగే చేసుకుపోతుంటారని ఇది అంత మంచిదికాదని వారు పేర్కొన్నారు.

రతిక్రియ అనేది వైల్డ్‌గానూ...థ్రిల్లింగ్‌గానూ ఉండాలని బ్రిటీష్ ఫర్టిలిటీ సొసైటీ కార్యదర్శి పాశీ తెలిపారు. తొలినాళ్ళల్లో మీరు ఎలాగైతే రతిక్రియలో పాల్గొంటుంటారో అలాగే ప్రతిసారీ రతిక్రియలో పాల్గొనాలని వారు కోరుతున్నారు. రతిక్రియలో పాల్గొన్నప్పుడు దాదాపు 25 కోట్ల శుక్రకణాలు(స్పెర్మ్స్) విడుదలవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాని పురుషులు పూర్తి సంతృప్తిని పొందితే అందులో 50శాతం అధికంగా పెరిగిపోతాయని వారి పరిశోధనలో తేలినట్లు ఆయన వివరించారు.

దంపతులు చాలా సమయం వరకు రతిక్రియలో పాల్గొంటే శుక్రకణాలు దాదాపు రెండున్నర కోట్ల కు చేరుకుంటాయని దీంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని పాశీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి