సెక్స్ చేస్తుంటే బలవంతం చేస్తున్నట్టు ఫీలవుతారు.. ఎందుకని?

బుధవారం, 23 నవంబరు 2011 (16:29 IST)
File
FILE
చాలామంది మహిళలు సెక్స్‌లో పాల్గొంటే బలవంతం చేస్తున్నట్టుగా ఫీలవుతుంటారు. దీంతో వివాహమై యేళ్లు గడిచిపోయినా.. కట్టుకున్న భార్యతో పరిపూర్ణ సెక్స్‌ సుఖాన్ని పొందలేక అనేక మంది భర్తలు కుమిలిపోతుంటారు. దీనికి కారణం సెక్స్ అంటే ఆమెకు ఇష్టం లేకపోవడమేనా అనే సందేహం వారిని వేధిస్తుంది. ఒకవేళ తనను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదా అనే మానసిక వ్యధతో నలిగిపోతారు. ఒక్క సెక్స్ విషయంలో మినహా మిగిలిన విషయాల్లో మాత్రం పూర్తిగా సహకరించడాన్ని భర్తలు జీర్ణించుకోలేక పోతారు. ఇలాంటి సమస్యలకు ఏ విధంగా పరిష్కరించుకోవాలన్న సందేహం అనేక మందిలో కలుగుతుంది. ఇదే అంశంపై మానసిక వైద్య నిపుణులు, సెక్స్ వైద్యులను సంప్రదించగా వారు కింది విధంగా సమాధానం చెపుతున్నారు.

ఇలాంటి మహిళలకు సెక్స్ పరిజ్ఞానం పూర్తిగా లేదని భావించాలంటారు. పైపెచ్చు.. ఆమె పెరిగిన వాతావరణం కూడా ఈ తరహా పరిస్థితికి కారణంగా చెపుతున్నారు. కుటుంబ కట్టుబాట్ల వల్ల పెళ్లీడు వచ్చేవరకు సెక్సు గురించిన పరిజ్ఞానం లేకపోవడం, అలాంటి పరిస్థితులలో సెక్సంటే వారిలో అంతర్గతంగా భయం, అపోహలు ఏర్పడటమే కారణంగా భావించవచ్చన్నారు.

ఇలాంటి సమస్యలను వీటిని తొలగించాలంటే స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, సెక్సు గురించి తద్వారా పొందే ఆనందం గురించి విడమరచి చెప్పాలని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పెళ్లయిన కొత్తలో కంటే భార్యను మరీ ఎక్కువగా ప్రేమించాలని, బిజీ షెడ్యూల్లో కూడా ఆమెకు కొంత సమయాన్ని కేటాయించి అన్ని విషయాలు మనస్సు విప్పి చర్చించుకోవాలని కోరుతున్నారు.

ఇలాంటి సమయం సందర్భాల్లో సెక్సు పట్ల ఆమెకున్న అపోహలు, అపార్థాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు. అప్పటికీ ఆమెలో మార్పు అనేది కనిపించకుండా ఉంటే కౌన్సిలింగ్ ఇప్పించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి