హస్త ప్రయోగం చేస్తుంటే.. సెక్స్ స్పందనలు తగ్గిపోతాయా?

WD
WD
యుక్త వయస్సులో ఉండే కుర్రాళ్లకు హస్త ప్రయోగం చేసుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. తమలో కామవాంఛ కలిగినపుడల్లా లేదా తమకు నచ్చిన యువతి మదిలో ఊహించుకుంటూ హస్త ప్రయోగం చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి బలమైన అపోహ ఉంటుంది. హస్త ప్రయోగం చేయడం వల్ల వీర్యం త్వరగా పడిపోతుందని, ప్రధానంగా, స్త్రీతో సెక్స్‌కు ఉపక్రమించే సమయంలో సెక్స్ స్పందనలు పెద్దగా కలగవు. దీంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై సెక్స్ నిపుణులను స్పందిస్తే...

సాధారణంగా సెక్స్ స్పందనలు అనేవి.. మెదడు స్తంభించి శృంగారనాడులు... శృంగార ప్రేరణలను లైంగికావయవాలకు చేరవేస్తాయంటారు. పురుష శృంగార హార్మోన్లు పూర్తిస్థాయిలో విడుదల కాని వారిలోనే ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుందని అంటున్నారు.

అలాగే, భయం, ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు శృంగారం చేయకపోవడమే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. పెళ్లికి సెక్స్‌లో పాల్గొనే సమయంలో సర్వసాధారణంగానే మనస్సులో భయం, ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో పాటు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో సెక్స్‌కు ఉపక్రమిస్తే రక్త ప్రసరణ ఎక్కువగా జరగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల హస్త ప్రయోగానికి సెక్స్ స్పందనలు కలగక పోవడానికి ఎలాంటి సంబంధం లేదని వారు వాదిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి