మాది విజయవాడ. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నా. ఇప్పటికే నిశ్చితార్థం ముగిసింది. నాకు కాబోయే భర్త శోభనం రోజున నగ్నంగా చూడాలని, నగ్నంగా సెక్స్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాడు. ఏం చేయాలి. నిజానికి నేను ఇంత వరకు అద్దం ముందు నిలబడి నన్ను నేను ఇంత వరకు చూసుకోలేదు. ఆయన కోర్కె ఎలా తీర్చాలి. సలహా ఇవ్వండి.
మీకు కాబోయే భర్త.. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండివుంటారు. అందుకే ఆయన ఇంత హడావుడంతా. ఒక విధంగా చెప్పాలంటే మీ కాబోయే వారు సెక్స్‌పై విపరీత ధోరణి అని చెప్పొచ్చు. శోభనం రోజున మీ భర్తకు మీ మనస్సులోని మాటలను వివరించి చెప్పండి. శృంగారం అనేది రెండు శరీల మధ్య జరిగేది అయినప్పటికీ.. ఇద్దరు మనస్సులు కలిసినపుడే అది పూర్తి సంతృప్తినిస్తుంది.