ముద్దుల్లో మునిగి తేలితే గనేరియా ఖాయమా?

శుక్రవారం, 19 జులై 2019 (14:51 IST)
సాధారణంగా గనేరియా వ్యాధి లైంగిక సంబంధం పెట్టుకుంటేనే సంక్రమిస్తుంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా తేల్చారు. అయితే, ఈ గనేరియా వ్యాధి విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకున్నా కూడా వస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ మేరకు అమెరికాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో తేలింది. 
 
ఇదే అంశంపై మోనాష్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ కిట్ ఫెయిర్లీ స్పందిస్తూ, 'గనేరియా అనేది వేగంగా పెరుగుతుందన్న విషయం గమనించాలి. ఇది ఎలా సంక్రమిస్తుందో తెలుసుకోవడంతోపాటు దీన్ని ఎలా నియంత్రించాలో అర్థం చేసుకోవడం కూడా కీలకమే. ముద్దు వలన కూడా ఈ ప్రమాదకర అంటువ్యాధి వ్యాప్తి చెందుతుందని అవగాహన కలిగించాలి. దాని నివారణకు యాంటీ బ్యాక్టీరియల్‌ మౌత్‌‌వాష్‌ వంటి కొత్త నియంత్రణ పద్ధతులను అనుసరించాలి' అన్నారు. 
 
ఈ అంటు వ్యాధి సోకినట్టయిదే జననాంగాల వద్ద సున్నితమైన పొరలను దెబ్బతీసి, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పిని కలిగిస్తుంది. అయితే, తాజాగా జరిపిన పరిశోధనల్లో ఈ వ్యాధి లైంగిక సంబంధం ద్వారానే కాకుండా, ముద్దుల వల్ల కూడా వ్యాపిస్తుందని తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు