ఆలుమగలు రోజూ అరగంటైనా మాట్లాడుకుంటున్నారా?

గురువారం, 23 ఏప్రియల్ 2015 (14:59 IST)
అసలే ఫాస్ట్ యుగం.. భార్యాభర్తల మధ్య మాటలే కరువయ్యాయి. అలాంటి పరిస్థితిల్లో ఒక రోజులో అరగంటైనా మాట్లాడుకోవడం ఎక్కడా..? అనుకుంటున్నారా..? అయితే ఇకపై మారండి. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే.. ప్రతి రోజూ అరగంట పాటు పొద్దుటో, లేదా రాత్రో కేవలం ఆలుమగలు మాత్రమే కబుర్లు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. పిల్లలు, ఇరుగుపొరుగువారు, బంధువులు మాటల మధ్య అడ్డం రాకుండా చూసుకోండి. ఆలుమగలు ఒక జంటగా ప్రతిరోజూ మనస్సు విప్పి మాట్లాడుకోగలగాలి. దానివలన ఆలోచనలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. భవిష్యత్ కార్యాచరణ మెరుగవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు. 
 
సాధారణంగా మగవాళ్లు, మాట్లాడటం తక్కువ. ఆడవాళ్ళకు మాట్లాడటం అంటే ఇష్టం. మహిళలు మగవారు మాట్లాడటానికి ఇష్టపడకపోయినా.. ఆయనకు పనిలో సాయం చేస్తూ నెమ్మదిగా ఆయన్ని మాటల్లోకి దించండి. అవున. కాదు. లేదు అనే పదాలను కాసేపు మరిచిపోయేలా చూడండి. ఆ రోజు ఎలా గడిచిందో అడగండి. అన్నీ చెప్పేదాకా వదలకండి. మీరు ఏం చేశారో అక్షరం పొల్లుపోకుండా చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యల గురించి ఆయన అభిప్రాయాలు, సలహాలు అడగండి. ఇలా మాటలు కలుపుతూ ఉంటే పురుషులు పొడిపొడిగా మాట్లాడటాన్ని, ఆఁ, వూఁ అని సరిపెట్టేసే వారిని పూర్తిగా మార్చేయవచ్చు. తద్వారా భార్యాభర్తల మధ్య సంబంధాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చునని మానసిన నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి