హాస్టల్‌లో ఉన్నపుడు స్నేహితురాలి ఒత్తిడి వల్ల హ.ప్ర అలవాటైంది.. బయటపడేదెలా?

శుక్రవారం, 22 మే 2015 (17:41 IST)
నా వయస్సు 24 యేళ్లు. పీజీ పూర్తి చేశాను. ప్రస్తుతానికి ఇంటి పట్టునే ఉంటున్నా. అయితే, నేను హాస్టల్‌లో ఉన్న సమయంలో నా ఫ్రెండ్ ప్రోద్భలంతో స్వయంతృప్తిని పొందుతూ వచ్చాను. డిగ్రీలో ఉన్నంత వరకు రోజుకు కనీసం రెండుసార్లు అయినా చేసుకునేదాన్ని. ఆ తర్వాత పీజీలో చేరాక, నా స్నేహితురాలు దూరమైంది. అప్పటి నుంచి నన్ను నేను నియంత్రించుకుని స్వయంతృప్తి (హస్త ప్రయోగం)కి పాల్పడటం చాలా వరకు తగ్గించుకున్నా. అయితే, ఇపుడు చదువు పూర్తి కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నా. దీంతో నా మనస్సంతా హస్త ప్రయోగం వైపు లాగుతోంది. నిగ్రహించుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడటం లేదు. ఏం చేయాలి. నాకు నచ్చిన యువకులతో సెక్స్‌లో పాల్గొందామని ఆలోచన వచ్చినా.. అలాంటి పనులు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే, హస్త ప్రయోగం చేసుకోకుండా ఉండటమెలా?
 
హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదే. అయితే, దానికే బానిసలుగా మారిపోరాదు. శృంగారంలో పాల్గొనని వారు.. స్వయంతృప్తి పొందడం ద్వారా కాస్తంత ఉపశమనం పొందుతారు. ప్రస్తుతం మీరు చేయాల్సిందంతా మనస్సులో ఆ ఆలోచన రాకుండా కంట్రోల్ చేసుకోవడం. అదేసమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండటం వల్ల ఈ తరహా ఆలోచనలు వస్తుంటాయి. అందువల్ల చదువులపై దృష్టిసారించండి. యోగా సాధన చేయండి. భవిష్యత్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలన్న దానిపై ఆలోచన చేయండి. అలాగే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇతర వ్యాపకాలపై మనస్సు లగ్నం చేయండి. తద్వారా హ.ప్ర ఆలోచనల నుంచి సులభంగా బయటపడొచ్చు.

వెబ్దునియా పై చదవండి