ప్రేమ పెళ్లి- పెద్దలు కుదిర్చిన పెళ్లి.. రెండింటిలో ఏది బెస్ట్.. అమ్మాయిని ఎలా డీల్ చేయాలి?

బుధవారం, 29 జూన్ 2016 (09:45 IST)
ప్రేమ వివాహానికి, పెద్దలు కుదిర్చిన వివాహాలకు చాలా తేడా ఉంటుంది. నిజానికి ప్రేమ పెళ్ళి చేసుకున్నవాళ్లలో అబ్బాయి, అమ్మాయికి ముందే పరిచయం ఉంటుంది కాబట్టి, వారిమధ్య ఉన్న చనువు కొద్ది సెక్స్ విషయంలో మొహమాటాలుండవు. ముఖ్యంగా అబ్బాయి పడక గదిలో ప్రవర్తించే తీరు కొత్తగా ఉన్నా, అమ్మాయి అర్థం చేసుకునే అవకాశం ప్రేమ పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కాని పెద్దలు కుదిర్చిన పెళ్ళిలలో అలా కాదు.
 
అమ్మాయి, అబ్బాయి మొదటిసారి మనసువిప్పి మాట్లాడుకునేది తొలిరాత్రి నాడే. తొలిరాత్రి అబ్బాయి తన మీద మంచి అభిప్రాయం కలిగేలా నడుచుకోవాలి. తొలి సంభోగంలోనే పెళ్లికొడుకు వింతగా ప్రవర్తించినా, రఫ్‌గా మెదిలినా పెళ్ళికూతురు బెదిరిపోతుంది. అందుకే తనతో ముందు ప్రేమగా పలకరించాలి. కొత్తింటి వాతవరణానికి అలవాటు పడేదాకా ఆమెను ఇబ్బందిపెట్టకూడదు. భర్తతో సమయం గడిపాలని ఆమెకు అనిపించేలా చూసుకోవాలి. అప్పుడే ఆ శృంగారం పండుతుంది.
 
అమ్మాయిలకి సహజంగానే సిగ్గు, బిడియం ఎక్కువ. తొలిరాత్రినాడు మొదటి స్పర్శలోనే సెక్స్‌లో తన ఇష్టాలు, కోరికలతో అమ్మాయిని ఇబ్బందికి గురిచేయకూడదు. కొత్త జంటలు శృంగారంలో ఇబ్బంది పడేది సరైన చనువు, అర్థం చేసుకునే మనస్తత్వం లేకపోవడం వల్లే. అందుకే శృంగారానికి కూడా ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టాలి. ఇద్దరు మానసికంగా దగ్గరైతేనే, శారిరకంగా మరింత దగ్గర కావచ్చు.

వెబ్దునియా పై చదవండి