తొలిరాత్రి... అబ్బాయి చెప్పినట్టు విను! నొప్పి అని దూరం నెట్టేయకు...

గురువారం, 23 ఆగస్టు 2018 (12:20 IST)
దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోయే ప్రతి యువతీయువకుడి మనసుల్లో అనేక భయాలు, ఆందోళనలు, సందేహాలు మెదలాడుతుంటాయి. ముఖ్యంగా, ఆ అనుభవం ఎలా ఉండబోతోంది? ఆహ్లాదంగా ఉంటుందా? భరించలేనంతగా బాధ పెడుతుందా?... అనే ఆలోచన అమ్మాయిల్లో ఉంటుంది. అటు పెళ్లికొడుకు పరిస్థితీ అదే. లెక్కలేనన్ని అనుమానాలు, భయాలు అబ్బాయిని అల్లకల్లోలం చేస్తుంటాయి. సామర్థ్యం సరిపోతుందా? ఒకవేళ విఫలమైతే? ఇలాంటి అనుమానాలకు, అపోహలు నివృత్తి కోసం నిపుణులను సంప్రదిస్తే...
 
ప్రధానంగా దంపతుల మధ్య శారీరక కలయిక అనేది పరీక్ష కాదు. తొలి ప్రయత్నంలో పాసయిపోయి మెప్పు పొందడానికి. జీవన గమనంలో అదొక ఘట్టం మాత్రమే. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ప్రతి యువతీ యువకుడు నడుచుకోవాలని సూచన చేస్తున్నారు. ముఖ్యంగా, అమ్మాయిలు మాత్రం మరింత దృఢచిత్తంతో ఉండాలని సూచిస్తున్నారు. 
 
ఎందుకంటే తొలి కలయికపైనే అమ్మాయిల్లో లేనిపోని అపోహలు ఉత్పన్నమవుతుంటాయి. తొలి కలయికలో భరించలేని నొప్పిని అనుభవిస్తామనే భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. తొలిరాత్రి 'అబ్బాయి చెప్పినట్టు విను! నొప్పి అని దూరం నెట్టేయకు!' అంటూ పెద్దలు చెప్పే మాటలతో ఉన్న భయం కాస్తా రెట్టింపవుతుంది. దాంతో భయం భయంగా శోభనం గదిలోకి వెళ్లి, కలయిక సమయానికి మరింత బిగుసుకుపోతారు. దాంతో అంగప్రవేశం క్లిష్టమై నిజంగానే నొప్పి మొదలవుతుంది. 
 
అసలు 'తొలి కలయిక నొప్పితో ముగుస్తుంది' అనే నమ్మకం ఏర్పడడానికి కారణం... 'కన్నెపొర'! కొందరిలో ఇది కాస్త మందంగా ఉండి అంగప్రవేశానికి ఆటంకం కలిగించవచ్చు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. నిజానికి ఎక్కువశాతం మంది అమ్మాయిల్లో కన్నెపొర చిన్నప్పుడు ఆటలాడేటప్పుడే చిరిగిపోతుంది. కాబట్టి నొప్పికి ఆస్కారం ఉండదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు