నా గర్ల్ ఫ్రెండ్ నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈమధ్య మా ఇద్దరికీ ఏకాంతం దొరికింది. దాంతో కౌగలింతల్లో మునిగిపోయాం. ఆ మత్తులో ఆమె యోనిపై చేయి వేసి స్పర్శించాను. ఆమె నా పురుషాంగాన్ని చూషించింది. అదే సమయంలో నేను ఆమె యోనిలో ఫింగరింగ్ చేశాను. అంతకుముందువరకూ సెక్స్ అంటే పెళ్లయిన తర్వాతే అని చెప్పిన ఆమె ఆరోజు తనకు సెక్స్ కావాలని గోల చేసింది. ఫింగరింగ్ చేస్తే సెక్స్ కోర్కె పెరిగిపోతుందా...? ఎందుకిలా జరిగినట్లు...?
ఈ భాగాన్ని స్పర్శిస్తే సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజ వాహికలోకి చూపుడు వేలు చొప్పించి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్ వద్ద స్పర్శించినట్లయితే స్త్రీ సుఖానుభూతులకు లోనవుతుందనీ, ఆ సమయంలో స్త్రీ మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ 1950లో గ్రాఫెన్‌బర్గ్ అనే సెక్సాలజిస్టు చెప్పాడు. అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది.
జి-స్పాట్‌కి ప్రేరణ చక్కగా లభించిన స్త్రీలు భావప్రాప్తి సమయంలో మూత్రనాళం నుంచి ద్రవాలను విడుదల చేస్తారనీ.. అనగా స్ఖలిస్తారనీ గ్రాఫెన్‌బర్గ్ పేర్కొన్నాడు. వాత్స్యాయనుడు 2000 ఏళ్ళ క్రితం ఆడవాళ్ళు కూడా స్ఖలిస్తారని పేర్కొన్నాడు. స్త్రీ స్ఖలనం గురించి పరిశోధన జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు.