భోజనం చేసిన వెంటనే శృంగారంలో పాల్గొంటే ఏమౌతుంది?

శనివారం, 5 మే 2018 (19:48 IST)
చాలామంది జంటలకు భోజనం చేసిన వెంటనే రతి క్రియలో పాల్గొంటే ఏమవుతుందన్న అనుమానం వుంటుంది. భోజనం చేసిన వెంటనే శృంగారం చేయడం కామసూత్రానికి విరుద్ధం. రతి క్రియకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం... 
 
ఎట్టి పరిస్థితుల్లోనూ పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలనేది వైద్యుల సలహా.  
 
సూర్యోదయం అవుతుండగా రతిక్రియ చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. కొందరు రాత్రి 7 గంటలకే భోజనాన్ని ముగిస్తారు. ఇలాంటి వారు రాత్రి 10 గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెపుతున్నారు. రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్థరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి. 
 
నిద్రకు ఉపక్రమించే ముందు పాలు సేవించకూడదు. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు సేవించాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకూడదనేది నియమం. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరుపకూడదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు