శృంగారంలో దంపతులు చేసే తప్పులేంటి?

సోమవారం, 3 డిశెంబరు 2018 (12:12 IST)
చాలామంది దంపతులు శృంగారంలో తమకు తెలియకుండానే అనేక తప్పులు చేస్తుంటారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఎవరు తప్పు చేసినా వారిని విసుక్కోకుండా.. వారిని తృప్తి పరిచేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ, వారిని చూసి నవ్వడం, సిగ్గుపడటం, సీరియస్‌గా ముఖం పెట్టడం వంటివి చేయరాదు. శృంగార సమయంలో దంపతులు చేసే తప్పులేంటో చూద్దాం. 
 
చాలామంది దంపతులు ఫోర్‌ ఫ్లేను పెద్దగా పట్టించుకోరు. నేరుగా శృంగారానికి వెళ్లిపోతారు. పురుషుడు దాని పట్ల ఎంత ఆసక్తి చూపిస్తారో.. స్త్రీ కూడా ఫోర్‌ ప్లేపై అంత ఆసక్తిని చూపుతుందన్న విషయాన్ని మరచిపోరాదని నిపుణులు చెప్తారు. స్త్రీ ఫోర్‌ప్లే ద్వారానే ఎక్కువగా భావప్రాప్తి పొందుతుందట. చాలా మంది పురుషులు.. తాము శృంగారం చేసేందుకు ముందుగా కొన్ని చేష్టలు చేస్తుంటారు. ఇలాంటివి కొంతమంది స్త్రీలకు నచ్చవు. 
 
శృంగారానికి ముందు నీలి చిత్రాలు చూసే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ చిత్రాలు చూసేందుకు స్త్రీ అలవాటుపడితే పురుషుడిని పెద్దగా పట్టించుకోరని, అందువల్ల ఈ తరహా చిత్రాలు చూపించరాదనేది నిపుణుల మాట. ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. శృంగారంలో దంపతులు కొత్తకొత్త పద్ధతుల్లో తృప్తిని చూడాలి తప్ప వేర్వేరు సాధనాలతో దాన్ని తీర్చుకోరాదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు