శృంగారంలో అది అంత సుళువగా అయిపోయిందెలా?

శనివారం, 6 అక్టోబరు 2018 (13:58 IST)
తొలిరాత్రి శృంగారం సుళువుగా జరిగినందుకు కొంతమంది సంతోషించక గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటారు. సునాయాసంగా పురుషుడు శృంగారం జరిగిపోవడంతో తను కట్టుకున్న యువతి కన్య కాదా అనే సందేహంతో ఆందోళన చెందుతుంటారు.


అది టైట్‌గా ఎందుకు లేదు.. అసలు తొలిరోజు శృంగారంలో రక్తం ఎందుకు రాలేదు... తన భార్యకు కన్నెపొర ఎందుకు లేదు.. ఇత్యాది సందేహాలతో సతమమతవుతుంటారు. ఈ సందేహాలను నమ్మే భర్తలు.. శోభనం రాత్రి నుంచే తమ భార్యలను అనుమానిస్తుంటారు.  
 
ఇదే అంశంపై వైద్యులను సంప్రదిస్తే... 99 శాతం అమ్మాయిల్లో ఎగరడం, దూకటం, ఆటలాడడం, సైకిల్ తొక్కడం, బస్సు ఎక్కడం, దిగడం వల్ల వారి వ్యక్తిగత ప్రదేశంలోని నాళాలను పూర్తిగానో, పాక్షికంగానో కప్పి ఉంచే "హైమెన్" అనే కన్నెపొర చిరిగిపోతుందని చెపుతున్నారు. కాబట్టి రక్తస్రావం అయితేనే కన్య అని అనుకోవడం మూర్ఖత్వమని అంటున్నారు. 
 
కొన్నిసార్లు హైమన్ పలుచగా ఉండి కలయిక సమయంలో రక్తస్రావం జరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. మరికొందరిలో ఇది మందంగా ఉండటం వల్ల రక్తస్రావం అయ్యేందుకు ఆస్కారం లేదంటున్నారు. ఇలాంటి విషయాన్ని పెద్దది చేసి.. వివాహానికి ముందే సంబంధం కలిగి ఉన్నారని భార్యలను అనుమానించడం తగదంటున్నారు. 
 
శృంగారోద్వేగానికి పురుషుడు లోనైనట్లే స్త్రీలు కూడా భర్త స్పర్శతో శృంగారోద్వేగానికి లోనవుతారు. అది శరీర ధర్మం. సహజమైనది కూడా. దానివల్ల స్త్రీ వ్యక్తిగత భాగంలో ద్రవాలు స్రవించి లూబ్రికేషన్స్ పెరిగి సులభంగా శృంగారం సాధ్యమవుతుందన్న విషయాన్ని గ్రహించాలని వారు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు