మా వారిలో పెళ్లయిన ఫీలింగ్స్ లేవు.. ఇంటికి రాగానే ఆ పని చేస్తున్నాడు...

శనివారం, 27 ఏప్రియల్ 2019 (18:16 IST)
నా భర్త ఓ బిజినెస్‌మెన్ కావడంతో సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి కడుపునిండా తినేసి నిద్రపోతున్నారు. కొత్తగా పెళ్లయిన ఫీలింగ్స్ ఆయనలో ఎంతమాత్రం కూడా కనిపించడంలేదు. నాకేమో...బెడ్రూంలో చిలిపి చేష్టలు, ముద్దూ ముచ్చట్లు, సరససల్లాపాలు చేస్తూ శృంగారం జరుపుకోవాలని, కలిసి స్నానం చేయాలని ఇలా అనేక కోర్కెలు ఉన్నాయి.

కానీ, ఆయన చాలా రిజర్వుడుగా ఉంటారు. అయినప్పటికీ ఆయనంటే నాకెంతో ఇష్టం. నా మనస్సులో దాగివున్న విషయాలు ఆయనతో పంచుకుని నా కోర్కెలను తీర్చుకోవాలని భావిస్తున్నా. ఆయన నా మాట వింటారంటారా?
 
చాలామంది పురుషులు తమ వ్యక్తిగత జీవితం, దాంపత్య జీవితాల కంటే వ్యాపారం, ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. పైగా.. కొత్తగా వివాహమైన పురుషుల్లో అటు ఉద్యోగం, ఇటు దాంపత్యం మధ్య బ్యాలెన్స్ కుదరక కాస్త ఆందోళన పడుతుంటారు. అందువల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇకపోతే మీరే చెపుతున్నారు.. రాత్రి పొద్దుపోయాక అలసిపోయి వస్తున్నారని, కనుక సమయం చూసుకుని నాలుగైదు రోజులు సెలవు తీసుకుని విహార యాత్రలకు వెళితే అన్నీ అవే సర్దుకుంటాయి. ప్రయత్నించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు