శృంగారం సమయంలో మద్యం తీసుకోమని వేధిస్తున్నాడు... ఆ పవర్ పెరుగుతుందనీ...

గురువారం, 2 మే 2019 (12:57 IST)
ఆయన ఈమధ్య వింతగా ప్రవర్తిస్తున్నాడు. అంతకుముందు శృంగారం సజావుగా చేసేవాడు. కానీ ఇటీవల అతడి వైఖరిలో మార్పు కనబడుతోంది. ఆ సమయంలో మద్యం సేవిస్తున్నాడు. అంతేకాదు... నన్ను కూడా ఓ పెగ్ తీసుకోమని బలవంతం చేస్తున్నాడు. అలా తీసుకుంటే పవర్ పెరుగుతుందని ఎవరో చెప్పారట. అప్పటినుంచి రోజూ తాగకుండా శృంగారం చేయడంలేదు. అలాగే నన్ను కూడా తాగి పాల్గొనమని అడుగుతున్నాడు. తాగితే నిజంగానే ఆ పవర్ పెరుగుతుందా....?
 
మద్యం తాగి శృంగారం చేస్తే ఆ సామర్థ్యం పెరుగుతుందనేది అవాస్తవం. మద్యం తాగినప్పుడు కోర్కె కలిగినా పెర్‌ఫార్మెన్స్ తగ్గుతుంది. ఫలితంగా శృంగారాన్ని సజావుగా చేయలేకుండా అవుతారు. మద్యానికి బానిస అయినవారిలో ఆ హార్మోన్ల స్థాయిలు కూడా తగ్గుతూ వస్తాయి. దాంతో సమర్థవంతంగా చేయలేకపోతారు. కాబట్టి అతడు మద్యం అలవాటు మానుకుని పోషకాహారం తీసుకుంటే అంతా బాగుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు