నీ వల్లకాదులే కానీ ఇక పడుకో అంటోంది... శృంగారంలో విఫలమవుతున్నా...

శుక్రవారం, 29 మార్చి 2019 (17:13 IST)
పెళ్లయి ఐదేళ్లయింది. అప్పట్లో నేను చేసే శృంగారానికి నా భార్య అలసిపోయేది. ఇక చాలు ప్లీజ్ అని బ్రతిమాలేదు. ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. ఆమె శృంగారం కావాలని అడుగుతుంటే నేను చేయలేకపోతున్నా. ఈమధ్య గంటసేపు చేసినా ఆమెను తృప్తి పరచలేకపోయా. దీనితో ఆమె నీవల్లకాదులే కానీ ఇక పడుకో అంటోంది. అసలెందుకు నేను శృంగారం చేయలేకపోతున్నానో అర్థం కావడంలేదు. ఎందుకిలా అయిపోయింది?
 
ఇలాంటి సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. భాగస్వామి భావప్రాప్తికి చేరి త్వరగా వీర్యం ఔట్ చేయమని గొడవపెడుతుంది. కానీ ఎంత చేసినా స్ఖలనం కాదు. దీనికి పలు కారణాలున్నాయి. అవి మానసికమైనవి, శారీరకమైనవి కూడాను. కొందరిలో థైరాయిడ్ సంబంధిత వ్యాధుల వల్ల లైంగిక అవయవాల్లో తగినంత సామర్థ్యం ఉండదు. 
 
అంతేకాదు, మద్యం, మత్తుమందు సేవించేవారిలోనూ స్ఖలనం ఓ పట్టాన కాదు. చేస్తుండగానే మెత్తబడిపోతుంది. ఎంత ప్రేరేపించినా తిరిగి మామూలుగా మారదు. కొన్నిసార్లు అధికరక్తపోటు మాత్రలు తీసుకునేవారిలోనూ ఇలాంటి సమస్య కనిపిస్తుంది. ఇంకా శృంగారం చేయబోయే కొద్ది క్షణాల ముందు హ.ప్ర చేసుకున్నవారిలోనూ ఇలాంటి ఇబ్బంది కనబడవచ్చు. కాబట్టి ఇవేమైనా వున్నాయేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఇవేవీ కానట్లయితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు