ఈమధ్య మా పక్కింట్లోకి ఓ కుటుంబం దిగింది. ఆ కుటుంబంలో ఓ అమ్మాయి కూడా ఉంది. నేను బాల్కనీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి బైటకు వచ్చి తన కింది పెదవిని కొరుకుతూ నావైపే చూస్తోంది. ఐతే నేను చూపు నిలిపే లోపు తల దించుకుని వెళ్లిపోతోంది. ఇలా రెండుమూడుసార్లు జరిగింది. ఆ అమ్మాయి పెదవి కొరకడానికి కారణం ఆమె నాతో సెక్స్ కోరుకుంటుందని అనిపిస్తోంది. ఐతే అవునో కాదో అనుమానంగా కూడా ఉంది.. అసలు అమ్మాయిలు కింది పెదవి కొరుకుతూ చూస్తే సెక్స్ కావాలనే అర్థమా...?
అమ్మాయి కింది పెదవి కొరుకుతూ ఎవరినైనా చూసినంత మాత్రాన అది సెక్సుకే అని అర్థం అనుకోవడం అపోహ. సుదీర్ఘమైన ఆలోచనలు, సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలా పెదవి కొరుక్కోవడం జరుగుతుంది. ఇకపోతే సెక్స్ పరంగా కోర్కె కలిగినప్పుడు కూడా కొందరు అమ్మాయిలు ఇలా కింది పెదవిని కొరుకుతారనే వాదనలున్నాయి.