రెండో బిడ్డ పుట్టాక.. దంపతుల మధ్య దాంపత్య జీవితం మళ్లీ చిగురిస్తుందట..!

శనివారం, 2 జులై 2016 (17:03 IST)
దంపతుల మధ్య బిడ్డలు పుట్టాక వాళ్ల బాగోగులు చూసుకునేందుకు సమయం సరిపోతుంది. పిల్లల చుట్టూ తిరుగుతూ.. దాంపత్య జీవితాన్ని పక్కనబెట్టేస్తుంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే ఏదో నడుస్తుందిలే అంటూ సంసారాన్ని ఈడుస్తుంటారు.

కానీ రెండో బిడ్డ పుట్టాక దంపతుల దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుందని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు. 
 
తాజాగా నిర్వహించిన పరిశోధనలో తొలి బిడ్డ పుట్టాక దంపతుల దాంపత్య జీవితంలో చాలా గ్యాప్ వస్తుందని.. అదే రెండో బిడ్డ పుట్టినా తొలి నాలుగు నెలల్లో కష్టాలు తీరిపోతాయని.. పిల్లల పెంపకం అలవాటైపోతుందని.. తద్వారా మునుపటి దాంపత్య జీవితం సొంతమవుతుందని మిచిగాన్ పరిశోధకులు పేర్కొన్నారు. 
 
రెండు వందలకు పైగా జంటలపై నిర్వహించిన ఈ పరిశోధనలో రెండో పురుడు తర్వాత భార్యాభర్తలు ఒకరిపై ఒకరు రుసరుసలాడుకోవడం బాగా తగ్గించేస్తున్నారని.. ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడం.. భాగస్వామి పట్ల చాలా బాధ్యతతో వ్యవహరించడం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. సో.. రెండో బిడ్డ పుట్టాక.. దంపతుల మధ్య దాంపత్య జీవితం మళ్లీ చిగురిస్తుందన్నమాట..!

వెబ్దునియా పై చదవండి