నట్స్‌ తీసుకుంటే ఆ కౌంట్ పెరుగుతుందట..!

శనివారం, 27 జులై 2019 (11:37 IST)
పప్పు ధాన్యాలతో లైంగిక సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడితో చాలామందికి సంతాన భాగ్యం కలగదని వైద్యులు అంటున్నారు. సంతానప్రాప్తి కోసం నట్స్ తినాలని వారు సూచిస్తున్నారు. జీడిపప్పు, బాదం, ఆక్రోట్లు, కిస్‌మిస్ వంటి గింజలు, పప్పులను రెగ్యులర్‌గా తింటూ ఉంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. 
 
రోజూ నట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ అరవై గ్రాముల బాదం, జీడిపప్పు, ఆక్రోట్లు తీసుకుంటే లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. నట్స్ రోజూ తింటూ ఉంటే స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాదు... వీర్యం నాణ్యత కూడా పెరుగుతుందని తెలిసింది. 
 
నట్స్‌తోపాటూ పాలు, మాంసం, గుడ్లు, చేపలు తింటూ ఉంటే కండరాలు పటిష్టం అవుతాయంటున్నారు డాక్టర్లు. ఫలితంగా లైంగిక సామర్ధ్య సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు