మా ఆఫీసు కొలీగ్‌ వద్ద శారీరక సంబంధ ప్రతిపాదన ఎలా చేయాలి?

మంగళవారం, 27 జనవరి 2015 (13:02 IST)
నేను సాఫ్ట్‌వేర్ కంపెనీలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నా.. వివాహమైంది. అదేసమయంలో మరో మహిళ స్నేహం కోసం నా మనస్సు పరితపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మా ఆఫీసులో ఓ మహిళ కొత్తగా చేరింది. ఆమె వివరాలు ఆరా తీయగా, వివాహమై ఒంటరిగా నివశిస్తున్నట్టు చెప్పింది. మా యిద్దరి మధ్య మాటలు కలిసి మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం. అయితే, నాకు మాత్రం ఆమెపై శృంగార కోర్కెలు కలుగుతున్నాయి. ఆమెను నా స్నేహితురాలిగానే కాకుండా, శృంగార భాగస్వామిగా చేసుకోవాలని ఆశగా ఉంది. ఆమె కూడా నాలాంటి కోర్కెలతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. గత యేడాదిన్నర కాలంగా ఆమె శారీరక సుఖానికి దూరంగా ఉంటున్నారు. అందువల్ల ఆమెను సెక్స్ కోసం ప్రతిపాదన చేస్తే సమ్మతిస్తుందా.? 
 
వివాహమైన మీరు.. మరో వివాహితపై ఆశపడటం ఏమాత్రం భావ్యం కాదు. పైగా ఆమె గురించి అలా ఊహించుకోవడం తక్షణం మానుకోండి. మీకు భార్య ఉన్నట్టే... ఆమెకు భర్త ఉన్నారు. ఇంటి పట్టున ఉండే మీ భార్య... తన కోర్కెలను తీర్చుకునేందుకు మరొకరి స్నేహం కోరుకుంటే మీరు సమ్మతిస్తారా? అలాగే, ఆమె భర్త మరో యువతితో సెక్స్ సంబంధం పెట్టుకుంటే సమ్మతిస్తుందా? దీనికంతటికీ కారణం మనస్సులో కలిగే కోర్కెలకు మీలో స్వయం నియంత్రణ లేకపోవడమే. మీ విధులపై దృష్టిసారించి, మీ మనస్సులో కలిగే కోర్కెలన్నీ భార్య ద్వారా తీర్చుకోండి. 

వెబ్దునియా పై చదవండి