రోజుకు ఎన్ని సార్లు సెక్స్‌లో పాల్గొనవచ్చు..? పక్కకు లెక్క అవసరమా?!

గురువారం, 11 డిశెంబరు 2014 (18:05 IST)
ప్ర : మాకు ఇటీవలే పెళ్లైంది. నా భర్త ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చీ రాగానే పక్కలోకి రమ్మంటాడు. ఆ తర్వాత రాత్రికి రెండు మూడు సార్లు సెక్స్ చేస్తాడు. మళ్లీ ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో కూడా బాగా సెక్సీ మూడ్‌తోనే ఉంటాడు. అసలు రోజుకి ఎన్ని సార్లు సెక్స్‌లో పాల్గొనవచ్చు? ఎక్కువ సార్లు శృంగారం అనారోగ్యమా?
 
 
జవాబు : స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ అనేది అనిర్వచనీయమైంది. దంపతుల మధ్య దాంపత్యం ఎన్నటికీ ఆరోగ్యమే కానీ అనారోగ్యం కాదు. అది భార్యభర్తల మధ్య సంబంధాన్ని, వారి మధ్య అన్యోన్యతను మరింత బలపరుస్తుంది. ఇకపోతే సెక్స్‌లో ఇన్ని సార్లు పాల్గొంటే ఆరోగ్యకరమనీ అంతకు మించి ఎక్కువ సార్లు పాల్గొంటే అనారోగ్యకరమనీ లెక్కేదీ లేదు. దంపతులు వారి వారి ఇష్టాలను బట్టి రోజుకి ఎన్ని సార్లు పాల్గొన్నా నష్టం లేదు. ఎక్కువ సార్లు పాల్గొంటున్నారంటే వారిలో ఒకరంటే ఒకరికి ఆకర్షణ, కోరిక ఎక్కువగా ఉన్నాయని అర్థం. కనుక మీకు  ఇబ్బంది లేకుంటే ఎన్నిసార్లయినా సెక్స్ చేయవచ్చు.

వెబ్దునియా పై చదవండి