మా ఇద్దరమ్మాయిలు నీలి చిత్రాలు చూస్తున్నారు... అడ్డుకునేదెలా?

శుక్రవారం, 5 డిశెంబరు 2014 (13:41 IST)
మాకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారీమధ్య పొద్దస్తమానం ల్యాప్ టాప్ చూస్తూ కాలంగడుపుతున్నారు. ఈమధ్య నేను వారి ల్యాప్ టాప్ ను పరిశీలిస్తే వారిరువురూ నీలి చిత్రాలు చూస్తున్నట్లు తెలిసింది. ఈ అలవాటును అడ్డుకునేదెలా...?
 
నెట్ ఎంతగా ఉపయోగపడుతుందో అంతగానూ నిష్ప్రయోజనమైన విషయాలను చూపిస్తుంది. యౌవనం తెచ్చే కోర్కెల కారణంగా కొందరు అమ్మాయిల్లో ఇలా నీలి చిత్రాలను చూసే అలవాటు ఉంటుంది. తమకు అందుబాటులో ఉన్న ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఈ తరహా చిత్రాలు చూస్తుంటారు. ముఖ్యంగా నేటి ఆధునిక జీవనశైలి... లక్షల్లో జీతాలు... పబ్‌ కల్చర్‌... ఇంటర్నెట్‌లో నీలి చిత్రాలు ఇవన్నీ యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. అందువల్ల అలాంటి సైట్ల జోలికి వెళ్లరాదని పిల్లలకు చెబితే తప్పేమీ లేదు.
 
తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్ని... వారి పోకడలు... ప్రవర్తనలు... అలవాట్లలో మార్పులను గమనిస్తూ ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. వాళ్లు జీవితంలో నిలదొక్కుకునేదాకా తప్పదు. ఈ విషయంలో సంయమనం పాటించాలి తప్ప వారిపై దుందుడుకు చర్యలు తీసుకోరాదు. మెల్లగా నచ్చజెపితే వాటికి దూరమవుతారు.

వెబ్దునియా పై చదవండి