ప్రేయసితో మాట్లాడుతుంటే.. వీర్యం లీకవుతోంది.. ఏమైనా సమస్యా?

శనివారం, 24 జనవరి 2015 (16:10 IST)
నా వయస్సు 23 యేళ్లు. నాకో ప్రియురాలు ఉంది. ఆమెతో ఫోనులో మాట్లాడినా లేక ముఖాముఖిగా సంభాషిస్తున్నా అంగం నుంచి జిగటలాంటి ద్రవం బయటకు వస్తోంది. బహుశా ఇది వీర్యమని అనుకుంటున్నా. ఇలా రావడం నాలో ఏదైనా సమస్య ఉన్నట్టా? ఈ అకాల స్ఖలనం ఎందుకు కలుగుతోంది. సలహా ఇవ్వండి.?
 
ఈ తరహా సమస్య చాలా మంది యువకులు, పురుషులు ఎదుర్కొంటారు. ఒక మనిషి లైంగికంగా నిద్ర లేచినపుడు ఇలాంటిది సంభవిస్తుంది. దీన్నే అకాల స్ఖలనం అంటారు. ఇది అంగ ప్రవేశాన్ని సులభం చేస్తుంది. ఇది కేవలం గర్ల్ ఫ్రెండ్‌ లేదా ఇష్టమైన మహిళతో మాట్లాడే సమయంలోనే కాదు పోర్న్ సీడీలు చూసే సమయంలో కూడా కలుగుతుంది. శృంగారంలో భావప్రాప్తి పొందే సమయంలో విడుదలయ్యే వీర్యానికి దీనికి తేడా ఉంటుంది. శీఘ్రస్ఖలనం, అకాల స్ఖలనంలు వేర్వేరు. అందువల్ల దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేరీర్‌పై దృష్టిసారించండి. 

వెబ్దునియా పై చదవండి