లైంగికోద్రేకాన్ని పెంచే ఫోర్‌ప్లే లేకుంటే దాంపత్య జీవితం తుస్సేనట...

మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:25 IST)
చాలా మందికి పెళ్లికి ముందే తమ శృంగార జీవితంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతుంటాయి. యువకులకు అయితే తమ అంగ పరిమాణంపై లేనిపోని సందేహాలు వస్తాయి. అలాగే, యువతులకు అయితే లైంగిక తృప్తితో పాటు తొలి అనుభవం ఎలా ఉంటుందోనన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. అయితే అంగ పరిమాణానికి లైంగిక తృప్తికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై పలువురు వైద్యులను సంప్రదిస్తే...
 
అనేక మంది యువకులు అంగ పరిమాణం గురించి తమ మిడిమిడి పరిజ్ఞానంతో ఏదేదో చెబుతూ ఉంటారు. పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే అంత తృప్తి పొందగలుగుతామనీ, అంగం పరిమాణం మీదే లైంగిక తృప్తి ఆధారపడి ఉంటుందనీ... ఇలా తమకు తోచిన విధంగా మాట్లాడుకుంటుంటారు. నిజానికి దాంపత్య శృంగారంలో అంగ పరిణామం కంటే బాహ్య రతే అత్యంత కీలకం. అంటే లైంగికోద్రేకాన్ని పెంచే ఫోర్‌ప్లే కొరవడినప్పుడు ఎంతటి అంగమైనా సంతృప్తిని ఇవ్వలేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఒకవేళ అంగ పరిణామం చిన్నదిగా ఉన్నట్టయితే, ఆ సైజుకు తగిన భంగిమలను ఎంచుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా, దంపతులిద్దరూ లైంగిక తృప్తిని సమంగా పొందాలంటే లైంగికోద్రేకాన్ని అందించే ప్రదేశాలను శోధించి, కొత్త ప్రయోగాలతో శృంగార జీవితాన్ని మథించాలనీ, ఇందుకోసం తగినంత సమయం, ఏకాంతం ఏర్పరుచుకోవాలని సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు