మొగుడికి మందు పెట్టి లోబరుచుకుందంటారు కదా... మా ఆయనకు పెట్టాలి... ఎక్కడ దొరుకుతుంది...?

సోమవారం, 8 డిశెంబరు 2014 (15:47 IST)
మొగుడికి మందు పెట్టి లోబరుచుకోవడం అనేది అపోహ. అసలు పెట్టుడు మందులు అనేవి లేనేలేవు. ఏ మొగుడయినప్పటికీ తన భార్య కొంగు పట్టుకుని వదలకుండా తిరుగుతుందని అంటే, ఆమె మీద అతడికి చెప్పలేనంత క్రేజ్ ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 
 
విపరీతమైన క్రేజ్ ఉన్నప్పుడు ఎవరు ఏమన్నా అనకుంటారనే ధ్యాస కూడా ఉండదు వారికి. ఇలాంటివారు ఇంట్లో ఎవరున్నప్పటికీ సెక్స్ భావనలు రాగానే ఆ అనుభవం కోసం పడక గదికి వెళ్లిపోతుంటారు. దీన్ని చూసినప్పుడే మీరనకున్నట్లు అదేదో మందు పెట్టి ఇలా మార్చేసిందని అనుకుంటారు. అంతేతప్ప మందు పెట్టి లొంగదీసుకోవడం వంటిదేమీ లేదు.

వెబ్దునియా పై చదవండి