ఎముకలకు సంబంధించిన వ్యాధులు స్త్రీపురుషుల సంయోగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంటాయి. ముఖ్యంగా పిరుదులు, భుజం, మోకాళ్ల ప్రాంతాలలోని ఎముకల అరుగుదల, పగుళ్ల వంటివి ఉంటే, వాటి పర్యవసానంగా కోపం, అసహనం, ఆత్మన్యూనత వంటివి తలెత్తుతాయి. దాంతో సంభోగానందం రసాభాస అవుతుంది. కాబట్టి రతి సమయంలో ఎక్కడెక్కడ ఉత్తేజం కలుగుతుందో, ఎక్కడ బాధ తలెత్తుతన్నదో తెలుసుకుని అందుకు అనుగుణంగా వైద్యుల సలహాలను, సూచనలను పాటిస్తూ ఉండాలి.