నా వయసు 27 సంవత్సరాలు. ఇటీవల ఉద్యోగం నిమిత్తం నగరానికి వెళ్లాను. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. నేను అద్దెకు ఉన్న ఇంటికి ఎదురుగా ఓ అందమైన యువతి ఉంది. ఆమెను తొలిసారి చూసిన దగ్గర్నుంచీ పొద్దస్తమానం ఆమెనే చూడాలనిపిస్తోంది. ఇంకా, ఈమధ్య ఆమె అలంకరణ తీరు చూసి మతిపోయింది. ఆమెను చూడనిదే ఉండలేకపోతున్నా. కొన్నిసార్లు హస్త ప్రయోగం కూడా చేసుకుంటున్నాను. నేను అంతగా ఆమె పట్ల ఆకర్షితుడనయితే ఆమె కూడా నన్ను గమనిస్తుందని అనుకున్నా కానీ ఆమె అలా కనిపించడంలేదు.
వెళ్లిన పని మరిచి పరాయి స్త్రీ పట్ల వ్యామోహం పెంచుకుని పెడదారిలో పయనిస్తున్నారు. ముందుగా ఆ ఆలోచల నుంచి బయటకు వచ్చేయండి. మీరు వెళ్లిన పని ఉద్యోగం కోసం. పైగా ఆమె పట్ల మీకు ఉన్నది ప్రేమ కాదని తేలిపోయింది. కేవలం శారీరక సుఖం కోసం తాపత్రయపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. పొరబాటున ఆమె మీ పట్ల ఆకర్షించాలని ఏదైనా స్ప్రే వంటిది చల్లారంటే ఆమె మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ జీవితం ఏమవుతుందో ఆలోచించుకోండి. పరాయి స్త్రీల పట్ల ఇలాంటి ఆలోచనలు మానుకుని ఉద్యోగం కోసం శ్రమించి మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చండి.