ఇద్దరు అమ్మాయిలు అలా చేస్కుంటుంటే అది చూస్తూ... ఇతను కూడా అందులో పాల్గోవాలట...

సోమవారం, 14 సెప్టెంబరు 2015 (21:10 IST)
నేను ఓ అబ్బాయిని ప్రేమించాను. మంచి మనసున్నవాడు. నేనంటే ప్రాణంగా ఉంటాడు. అతడు నాకంటే చాలా అందగాడు కూడా. మేమిద్దరం చాలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు సెక్సు గురించి కూడా మాట్లాడుకుంటాం. ఈమధ్య అతడు ఇతర అమ్మాయిల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. నేను కూడా ఇతర అబ్బాయిల గురించి చెపుతుంటే ఆనందించేవాడు. ఇటీవల అతడు చెప్పిన ఓ కోరిక విని షాకయ్యాను. 
 
ఇద్దరు అమ్మాయిలు స్వలింగ సంపర్కంలో పాల్గొంటుంటే అది చూడాలని ఉందట. అంతేకాకుండా వారితో సెక్సు చేయాలని కోరికగా ఉందని చెప్పాడు. అది విని నాకు భయం వేసింది. ఇతరులు సెక్స్ చేస్కుంటుంటే చూడటం నాకిష్టమే కానీ, అతను కొత్త అమ్మాయిలతో కలుస్తాడనే ఊహను నేను భరించలేకపోతున్నాను. అతడి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేదెలా...?
 
సెక్సీ కబుర్లు ప్రేమికుల మధ్య సాధారణమే. ఐతే అవి గాడి తప్పినప్పుడే అసలు చిక్కు మొదలవుతుంది. ఒకరికొకరు కొత్త అనుభవాలు చెప్పుకోడం తప్పులేదు కానీ ఇతరులతో సంబంధాలు గురించి ఆలోచనలు చేయడమే అసాధారణం. ఇలాంటి చర్చ ఆరంభంలో కాస్త థ్రిల్ కల్గించవచ్చునేమోగానీ ఆ తర్వాత వాటి వల్ల సమస్యలు వస్తాయి. ముగ్గురు, నలుగురుతో కలిసి సెక్స్ అనేది ఒక ప్రయోగంగా అనుకోవచ్చునేమోగానీ, దానివల్ల ఎన్నో నష్టాలున్నాయి. కనుక అలాంటి ఆలోచనలు, చర్చలు ఇకపై చేయడం మానేయమని చెప్పండి.

వెబ్దునియా పై చదవండి