అది ఎంతవరకు వెళ్లగలుగుతుందో తెలియడం లేదు....

మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (22:50 IST)
మాకు ఈమధ్యనే పెళ్లయింది. ఇద్దరం దాంపత్యంలో బాగానే పాల్గొంటాం. కానీ నాకో సందేహం కలుగుతోంది. సెక్స్ సమయంలో నా పురుషాంగం ఒక్కోసారి పొడవు ఎక్కువవుతుంది. అలాంటి సమయాల్లో సైతం నా భార్య బాధగా ఉన్నట్లు చెప్పదు. కొన్ని సమయాల్లో మామూలుగా ఉంటుంది. అప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది. అంత పొడవైనప్పుడు అలాగే ఉండే ఆమెకు కొన్నిమార్లు ఇలాగైతే అసంతృప్తి కలుగదా... అసలు సెక్స్ సమయంలో పురుషాంగం ఎంతవరకు లోపలికి వెళ్లగలుగుతుంది..?
 
ఇలాంటి అర్థపర్థం లేని సందేహాలతో చాలామంది పురుషులు తమ దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయడం మాని ఆలోచనలతో పాడుచేసుకుంటుంటారు. పురుషాంగం సెక్స్ సమయంలో స్తంభించిన తర్వాత ఇక దాని పొడవుతో సంబంధం లేదు. స్త్రీ యోనిలో కామనాడులు 2 నుంచి 4 అంగుళాల లోతు వరకూ ఉంటాయి. ఆ తర్వాత ఎంత లోతుకు వెళ్లినా కలిగే ఫలితం అలాగే ఉంటుంది. కాబట్టి పురుషాంగం ఎంత లోనికి వెళ్లాలన్న సందేహం అక్కరలేదు.

వెబ్దునియా పై చదవండి