నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల మా బంధువుల ఇంటికి వెళ్లాను. అక్కడ మా సోదరి కుమార్తె నా పట్ల చాలా శ్రద్ధ చూపించింది. నాకు అన్ని సపర్యలు చేసింది. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత ఫోనులో చాలాసార్లు మాట్లాడింది. ఈమధ్య ఆమె మాటల్లో తేడా కనబడింది. నేనంటే అభిమానమనీ, ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని అంటోంది. నాక్కూడా ఇప్పటివరకూ పెళ్లి కాలేదు. నా వయసు 32 ఏళ్లు. ఆమె వయసు 18. దీంతో నువ్వు నాకంటే చాలా చిన్నదానివనీ, నాకు వయసు ఎక్కువని చెప్పినా వినడంలేదు. ఐతే అమ్మాయి చాలా బావుంటుంది. అలాగని అంత వయసు తేడాతో ఆమెను చేసుకుంటే ఆమెను సెక్స్ పరంగా తృప్తిపరచలేనేమోనని అనుమానంగా ఉంది. అంతేకదా...?
మీ ఇద్దరి మధ్య సెక్స్ పరంగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోయినప్పటికీ.. దగ్గరి సంబంధీకులు కనుక జన్యుపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేకపోలేదు. వంశపారంపర్య అనారోగ్యాలు మీ సంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇరువురి వంశాల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుంటే మీరు నిర్భయంగా వివాహం చేసుకోవచ్చు. ఆమె ఇంకా టీనేజ్ వయసులోనే ఉంది. ఆమె మీ పట్ల చూపించేది ప్రేమో లేక ఆకర్షణో చెక్ చేసుకోండి. ముఖాముఖి మాట్లాడి అన్ని విషయాలు చర్చించిన మీదట పెళ్లి వైపు అడుగులేయండి. అలాగే వయసు తారతమ్యం మరీ అంత భారీగా లేకపోవడమే మంచిది. ఇది ఇద్దరికీ మంచిది.