ఆ కారణం వల్ల నాకు పెళ్లంటే భయం వేస్తోంది... కాబోయే భార్యను...

సోమవారం, 12 అక్టోబరు 2015 (16:36 IST)
నా వయసు 27 సంవత్సరాలు. మా ఇంటిలో నాకు  పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. నాకేమో సెక్స్ కోరికలు ఎక్కువే. డైలీ హస్తప్రయోగము చేస్కుంటాను. హస్త ప్రయోగము చేసేటపుడు 3 నిముషాలకే వీర్య స్ఖలనం అయిపోతుంది. ఇలాగైతే నాకు వచ్చే భార్యని సంతోషముగా చూసుకోలేనేమోనని భయంగా ఉంది. దీనికి కారణం ఎక్కువసార్లు హస్త ప్రయోగం చేసుకోవడం వలనేమో అని అనుమానం కూడా వుంది. ఎలాంటి పండ్లు తింటే పురుషాంగం బాగా ఎక్కువసేపు స్తంభించి ఉండి ఆ తర్వాత వీర్య స్ఖలనం అవుతుంది. నా  సమస్యకు పరిష్కారం చూపగలరు. 
 
సెక్స్ కోర్కెలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. హస్త ప్రయోగం చేసినప్పుడు ప్రత్యేకించి ఇన్ని నిమిషాలకే వీర్య స్ఖలనం జరుగాలని ఏమీలేదు. సెక్స్ స్పందనలు కలిగినప్పుడు యువతీయువకులు హస్తప్రయోగాన్ని ఆశ్రయిస్తారు. అలాంటప్పుడు 3 నిమిషాల్లోనే కాదు.... 2 నిమిషాల్లో కూడా జరిగిపోతుంది. కాబట్టి అదేమీ సమస్య కాదు. సెక్స్ స్పందనలుండి అంగం స్తంభిస్తున్నప్పుడు సెక్స్ సంబంధిత సమస్యలు దాదాపు లేనట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఐనా వీర్య స్ఖలనం శీఘ్రంగా కాకుండా అడ్డుకోవాలంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అనుసరిస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో వీర్య స్ఖలనమవుతుందనగానే కొద్దిసేపు ఆపివేసి మళ్లీ ప్రారంభించవచ్చు.

వెబ్దునియా పై చదవండి