మా పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది. పిల్లల కోసం మరో రెండేళ్లు ఆగుదామని అనుకున్నాం. ఈ లోపు దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలని, వీలున్నప్పుడల్లా దేశంలో ఆయా ప్రదేశాలకు వెళ్లి ఆనందంగా గడిపి వస్తుంటాం. ఐతే ఈమధ్య ఆయనలో ఓ వింత ప్రవర్తన కనిపిస్తోంది. స్నానాల గదిలో నాతో సెక్స్ చేసినట్లు ఆయనకు ఫాంటసీ కలిగిందట. దాన్ని నిజం చేద్దామని నాపై ఒత్తిడి చేస్తున్నారు. బాత్రూంలో అలాంటి పనికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఐతే ఆయన చాలా ఫోర్స్ చేస్తున్నారు. అలా పాల్గొనక తప్పేట్లు లేదు. కానీ శరీరంపై సబ్బుతో సెక్సులో పాల్గొంటే ఏమైనా హాని కలుగుతుందేమోనని భయంగా ఉంది...?
కొంతమంది పురుషులు ఇలాంటి భిన్నమైన పద్ధతుల కోసం ఆరాటపడుతుంటారు. ఓసారి చవిచూశాక మళ్లీ దాని గురించి అడక్కుండా సైలెంట్ అయిపోయేవారూ ఉన్నారు. ఇక శరీరంపైన సబ్బుతో సెక్స్ అంటే... మీరు అనుకుంటున్నట్లే సబ్బులో రసాయనాలుంటాయి. సెక్స్ చేసే సమయంలో అవి లోనికి వెళితే వ్యక్తిగత ప్రదేశంలో మంట, దురద కలిగించవచ్చు. కాబట్టి అలాంటి వాటిని వాడకుండా సహజరీతిలో పాల్గొంటే ఆరోగ్యకరంగా ఎలాంటి సమస్య లేకపోవచ్చు.