నగరంలో కాలేజీ చదువు కోసం మా పిన్ని వాళ్ల అబ్బాయిని పంపారు. నాకంటే నాలుగేళ్ల పెద్దవాడు. నేను డిగ్రీ చదవుతున్నాను. ఈమధ్య వాడి వైఖరిలో ఏదో తేడా కనబడుతోంది. ఏదో వంకతో నన్ను ఎక్కడంటే అక్కడ తాకుతున్నాడు. మరీ వక్షోజాల వైపుకు చేతులు కదిపే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి బిహేవియర్ చూస్తుంటే నాకు అసహ్యమేస్తోంది. గట్టిగా చెప్పలేకపోతున్నాను. ఈ విషయం పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్తే ఫలితం ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. నేను మా పేరెంట్స్ కి చెబితే వాడిని ఇంటిని తరిమేస్తారు. వాడి చదువు నాశనమవుతుంది. అలాగని వాడి టార్చర్ భరించలేకపోతున్నాను. బయటపడటమెలా...?
ఇలాంటి విషయాల్లో మొహమాటాలు పనికిరావు. అతడు ఎక్కడ తాకుతున్నా అలా వదిలేస్తే అతడు చాలాదూరం వచ్చేస్తాడు. మీ పట్ల అతడి వ్యవహరిస్తున్న తీరును మీ పెద్దలతో చెప్పడం ఇష్టం లేదు కాబట్టి మీరే కూర్చుని అతడితో పిచ్చి వేషాలు వేయడం మానేసి బుద్ధిగా చదువుకోమని చెప్పండి. అప్పటికీ వినకపోతే పెద్దలకు చెప్పాల్సిందే. ఉపేక్షిస్తే టార్చర్ ఎక్కువవుతుంది.