చదువు, ఉద్యోగం, కెరీర్... అనుకుంటూ పెళ్లి చేసుకోకుండా నెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా వయసు 30 ఏళ్లు. నాకు వచ్చే రెండు మూడు నెలల్లో పెళ్లి కాబోతోంది. సంతోషంగానే ఉంది కానీ ఓ సమస్య నన్ను వెంటాడుతోంది. అదేమిటంటే... నేను పెళ్లాడే అమ్మాయి వయసు 22 ఏళ్లే. ఆమెను పెళ్లాడాక సెక్సు పరంగా పూర్తిగా తృప్తిపరచగలనా లేదా అని. ఆమెను తృప్తిపరచగల సెక్స్ సామర్థ్యం నాకు ఉందో లేదో తెలియడంలేదు... ఇప్పుడు ఇదే ప్రశ్నతో సతమతమవుతున్నాను...
అంగస్తంభనలు ఉన్నంతవరకూ సెక్స్ పరంగా ఎలాంటి బలహీనత లేనట్టే. ఇకపోతే వయసురీత్యా కాస్తంత వేగం తగ్గవచ్చును కానీ తృప్తిపరచలేకపోవడమనేది మనసుకు సంబంధించినది. కొందరు 20 ఏళ్ల వయసులో కూడా వారానికి రెండుమూడుసార్లు మించి సెక్స్ చేయలేరు. మరికొందరు 40 ఏళ్లు వయసు దాటిన తర్వాత కూడా వారానికి మూడునాలుగుసార్లు పాల్గొంటారు. కాబట్టి సెక్స్ అనేది ఆయా వ్యక్తుల మనస్తత్వాల పైన ఆధారపడి ఉంటుంది. సెక్స్ సామర్థ్యం అనేది ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఉంటుంది. కాబట్టి అతిగా సెక్స్, తృప్తి అంటూ ఏవేవో ఆలోచనలు చేస్తుంటే మానసికంగా సమస్య తలెత్తవచ్చు. కనుక అలాంటి ఆలోచనలు మానేసి హ్యాపీగా పెళ్లి చేసుకోండి.