పెళ్లయిన నాలుగేళ్లకు ఆయనలో ఈ వింత మార్పు చూసి నాకు ఏం చేయాలో తోచడంలేదు. ఇదివరకు సెక్సులో పాల్గొనేటప్పుడు ఎంతో తృప్తిగా ఉండేది. ఇటీవల ఆయన చిత్రవిచిత్ర చేష్టలు చేస్తున్నారు. విపరీత ధోరణి కనబరుస్తున్నారు. నాలుగేళ్ల కిందట కంటే ఇప్పుడు నేను చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉన్నానట. ఈ అందాన్ని ఇలాగే బంధించి ఎల్లప్పుడూ ఆనందించాలని అంటున్నాడు. అందుకని సెక్సులో పాల్గొనేటపుడు నగ్నంగా వీడియోలు తీసేందుకు అంగీకరించాలని గొడవపెడుతున్నాడు. చివరికి ఆయన పోరు భరించలేక ఒప్పుకున్నాను. ఐతే ఇలాంటి వీడియోలు పొరబాటున బయటకు వస్తే పరువు పోతుంది. ఈ మాట చెప్పినా వినడంలేదు. నావద్ద ఉన్నవి బయటకెలా వెళతాయంటున్నారు. అసలీయన ప్రవర్తన ఎందుకిలా మారింది..?
ఇలాంటివి కొందరిలో కనబడేవే. కొందరు తన భార్య సెక్సీగా ఉంటుందనీ, ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెతో మోడ్రెన్ డ్రెస్సులు వేయించి తిప్పుతారు. అలాంటి విపరీత ధోరణే ఇది కూడా. అతడు చేసేవి పడకగదికే పరిమితమైతే ఫర్వాలేదు. కానీ పడకగది దృశ్యాలను బంధించి బయటకు పట్టుకుపోవడం ప్రమాదం. అవి పొరబాటును లీకయితే మీరనుకున్నట్లు పరువు పోతుంది. కాబట్టి అలాంటి ఫోటోలు, వీడియోలు పడకగది దాటకూడదని చెప్పండి. ఇలాంటి పనులు మీకు ఇష్టం లేదని మెల్లమెల్లగా చెబుతూ ఉంటే అతను తప్పక మారుతాడు. ఇలాంటివాటి గురించి మరీ తీవ్రంగా ఆలోచన చేయవద్దు. ఆ దృశ్యాలను మాత్రం బెడ్రూంకే పరిమితమయ్యేట్లు చూసుకోండి. కొన్నాళ్లకు ఆయనలో మార్పు వస్తుంది. అప్పటికీ ఆయన వైఖరిలో మార్పు రానట్టయితే సెక్సాలజిస్టును సంప్రదించండి.